HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Speech Palasa Public Meeting

CM Jagan : బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదు – సీఎం జగన్

  • Author : Sudheer Date : 14-12-2023 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Barrelakka
Jagan Barrelakka

పలాసలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (Barrelakka) కు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ (Janasen Party) కి రాలేదని , కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ కి దక్కలేదని ఎద్దేవా చేసారు.

గురువారం పలాసలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project) ప్రాజెక్టు తో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ (YSR Kidney Research Centre), సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సహించలేదని, ఇలాంటి పరిస్థితిలో తమ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమ­స్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మించినట్లు.. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు… సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్‌ కలర్‌ డాప్లర్, మొబైల్‌ ఎక్స్‌రే, థూలియం లేజర్‌ యూరో డైనమిక్‌ మెషీన్‌ వంటి పరికరాలతోపాటు ఐసీయూ సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు.

ఇదే సందర్బంగా మాజీ సీఎం చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు కురిపించారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చంద్రబాబు ఎత్తులు , పొత్తుల మీద ఆధారపడతాడని..తెలంగాణ అసెంబలి ఎన్నికల్లో తన దత్తపుత్రుడ్ని బరిలో నిల్చోపెడితే కనీసం డిపాజిట్ కూడా రాలేదని..అంతే ఎందుకు నా చెల్లెమ్మ బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా ఆ పార్టీ కి రాలేదని జగన్ ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు , దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని జగన్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటారు..విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తారంటూ తనదైన శైలిలో జగన్ కామెంట్స్ చేసారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏంచేయాలో నిర్ణయిస్తామంటారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also  : Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Telangana Assembly Elections
  • Barrelakka
  • jagan
  • Janasena
  • palasa meeting
  • Pawan

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd