Jagan Reform : ఉచిత విద్య, వైద్యం దిశగా సంస్కరణలు
విద్యా , వైద్య వ్యవస్థలను సమూలంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Reform) మార్చేస్తున్నారు.
- Author : CS Rao
Date : 21-04-2023 - 5:05 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యా , వైద్య వ్యవస్థలను సమూలంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Reform) మార్చేస్తున్నారు. ఆ రంగాల్లో (health-education)సంస్కరణల వేగాన్ని పెంచారు. అందుకోసం అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. ఈ ఏడాది మెగా డీఎస్సీ ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న టీచర్లను నిబంధనల ప్రకారం పర్మినెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే 10 వేలకుపైగా అంగన్‌వాడీలను ఫౌండేషన్ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన 45 వేల అంగన్‌వాడీలను కూడా ప్రాధాన్యతా ప్రాతిపదికన అప్‌గ్రేడ్ చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధమయింది.
విద్యా , వైద్య వ్యవస్థల సంస్కరణ (Jagan Reform)
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోనూ సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు ఉండాలని (Jagan Reform) ఆదేశించారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను ఉంచడంపై అధికారులు దృష్టి సారించాలని, అలాగే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సూపర్‌వైజర్లపై నిఘా ఉంచి అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని జగన్ దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్యా శాఖలో దాదాపు 10 వేల ఖాళీలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అలాగే, కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేయబోతున్నారు. కర్ణాటక తరహాలో ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం బదిలీలకు బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు.
మెగా డీఎస్సీ ప్రకటించడానికి కసరత్తు
ఇక వైద్య రంగంలోనూ భారీ మార్పులను ఏపీ ప్రభుత్వం(Jagan Reform) తీసుకొచ్చింది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కనీస సదుపాయాలను కల్పించింది. వైద్య పోస్టులను భారీ భర్తీ చేసింది. ఖాళీగా ఉన్న వాటిని వెంటనే భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు ఇచ్చారు. లండన్ తరహాలో ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ప్రతి ఇంటిలోని సభ్యులను వైద్యులు వెళ్లి పరిశీలిస్తారు. క్యాలెండర్ ప్రకారం వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. వ్యాధుల చరిత్రను అధ్యయనం చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ కింద వెయ్యికి పైగా రోగాలను చేర్చారు.
Also Read : Jagan : తాడేపల్లిలో పోస్టుమార్టం,ఏ క్షణమైన ఢిల్లీకి జగన్?
రాబోవు రోజుల్లో విద్య, వైద్యం (Health-education)ఉచితంగా అందించే ఏర్పాట్లను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, సంస్కరణల అంశాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యం, విద్యను అందుకునే ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వ బెనిఫిట్స్ ను ఇస్తున్నారు. ఆ తరహా పద్ధతి మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు బెనిఫిట్స్ కావాలంటే, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదవించాలన్న నిబంధనపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఉద్యోగులకు ఇచ్చే ఆరోగ్య బెనిపిట్స్ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పొందాలనే నిబంధన పెట్టబోతున్నారని తెలుస్తోంది. అందుకే, విద్య, వైద్య రంగాలను ముందుకు సంస్కరిస్తున్నారని చెబుతున్నారు. ఈ రెండు రంగాలు మెరుగైన సేవలు అందిస్తే ప్రజలకు ఆర్థిక భారం ఉండదని జగన్మోహన్ రెడ్డి (Jagan Reform) భావిస్తున్నారు. అందుకే, వచ్చే ఎన్నికల్లో ఉచిత విద్య, వైద్య పాలసీని ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
Also Read : Jagan : చంద్రబాబు సెల్పీ ఛాలెంజ్ కు జగన్ మరో ఛాలెంజ్