HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Plan Reverse

Jagan : జగన్ ప్లాన్ బెడిసికొట్టింది

Jagan : జూలై 1 నుంచి నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అయితే ఈ పిలుపునకు వైఎస్సార్‌సీపీ నేతల నుండి పెద్దగా స్పందన లేకుండాపోయింది

  • Author : Sudheer Date : 03-07-2025 - 12:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ప్రారంభించగా, అది బెడిసికొట్టింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. జూలై 1 నుంచి నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అయితే ఈ పిలుపునకు వైఎస్సార్‌సీపీ నేతల నుండి పెద్దగా స్పందన లేకుండాపోయింది. గడపగడపకు వెళ్లి చంద్రబాబు అమలు చేయని హామీలను ఎండగట్టాలంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలను నేతలు పట్టించుకోకపోవడం జగన్ ను అసంతృప్తికి గురిచేసింది.

PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం

కృష్ణా, నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాలో బలమైన బేస్ ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ క్యాడర్ చురుకుగా పాల్గొనకపోవడం గమనార్హం. ముఖ్యంగా జగన్ స్వంత జిల్లా అయిన కడపలోనే ఈ కార్యక్రమం అమలు కాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చాటుతోంది. మొట్టమొదటి దశలో 35 నిమిషాలపాటు జగన్ ప్రసంగాన్ని భారీ స్క్రీన్‌లపై ప్రదర్శించాలని చెప్పినా, చాలా చోట్ల ఆ స్క్రీన్లు ఏర్పాటే కాలేదు. ప్రజల్లోకి వెళ్లి చర్చ ప్రారంభించాలన్న జగన్ ఆలోచనను క్యాడర్ కార్యరూపంలోకి తేవడంలో విఫలమయ్యారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య తిరిగే ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదన్నదే అనేక కార్యకర్తల అభిప్రాయం.

ఇదే సమయంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం “సుపరిపాలన తొలి అడుగు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ప్రచారం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే కాకుండా, ప్రభుత్వ హామీలు ఎలా అమలవుతున్నాయో కూడా వివరిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన కార్యకమానికి పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. దశల వారీగా జరుగాల్సిన కార్యక్రమం పార్టీ స్థాయిలోనే స్తబ్దుగా మారిపోవడంతో జగన్ వేసిన వ్యూహం బెడిసికొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • jagan plan
  • ycp
  • YS jagan Chandrababu Recalling Plan Reverse
  • YSRCP Vs TDP

Related News

BR Naidu

తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd