AP Liquor Case : ఛార్జ్ షీట్ లో జగన్ పేరు..ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చా..?
AP Liquor Case : ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు శనివారం సాయంత్రం 305 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ స్కామ్ గురించి ముందుగానే తెలిసిందని
- By Sudheer Published Date - 09:21 AM, Sun - 20 July 25

వైఎస్ జగన్ హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (AP Liquor Case) మరింత లోతుగా వెళ్తుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు శనివారం సాయంత్రం 305 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ స్కామ్ గురించి ముందుగానే తెలిసిందని, ఆయన్ను ముట్టడి చేయకుండానే పాలసీ మార్పులు జరిగాయని పేర్కొన్నారు. అయితే ఆయనను నేరుగా నిందితుడిగా చేర్చలేదు. కానీ ఆయన అత్యంత సన్నిహితులైన నాయకులు, బిజినెస్ భాగస్వాముల పేర్లు పలుమార్లు ఛార్జిషీట్‌లో కనిపిస్తున్నాయి.
ఈ లిక్కర్ కుంభకోణం దర్యాప్తులో ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులు, సంస్థలు నిందితులుగా ఉన్న నేపథ్యంలో, తాజాగా మరో ఎనిమిది మందిని ఈ కేసులో సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. వీరిలో సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరంతా స్కామ్ అమలులో కీలక పాత్ర పోషించినట్టుగా సిట్ తన విచారణలో నిర్ధారించినట్టు తెలుస్తోంది.
Protein : నాన్‌వెజ్ తినేవారికే కాదు.. వెజ్ తినేవారికి కూడా అధిక ప్రోటీన్..అవేంటో.. చూసేద్దాం.!.
ప్రాథమిక ఛార్జిషీట్ ప్రకారం.. లిక్కర్ పాలసీ మార్పులు విధివిధానాలను పక్కాగా ప్రణాళిక చేసుకున్న తర్వాతే అమలు చేశారని, ముఖ్యంగా ముడుపుల కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అభిప్రాయపడింది. స్కాంలో లభించిన సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎక్కడకి తరలించారు అనే అంశాలు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి. మొత్తం 16 మందిపై అభియోగాలు నమోదు చేయడం ద్వారా కేసు దిశ మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇది తుది ఛార్జిషీట్‌కు ముందు కీలక మలుపుగా భావిస్తున్నారు విశ్లేషకులు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్‌పై దృష్టి సారించి, 2024 ఫిబ్రవరి 5న సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించిన అనంతరం ఏప్రిల్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం కీలక నిందితులైన ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు. తాజాగా మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మొత్తం అరెస్టులు 12కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని అభియోగాలు, అరెస్టులు జరగవచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇక ఛార్జ్ షీట్ లో జగన్ పేరు ప్రస్తావించడం తో ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంత మాట్లాడుకుంటున్నారు.