HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Mohan Reddy Will Visit Vijayawada Jail Tomorrow

Jagan : విజయవాడ జైలుకు జగన్..ఎందుకంటే..!!

Jagan : ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు చేరుకొని, నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని కలవనున్నారు

  • Author : Sudheer Date : 17-02-2025 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Vamshi
Jagan Vamshi

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh politics) మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు చేరుకొని, నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని కలవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వంశీ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనతో వల్లభనేని వంశీ పేరు తెరపైకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనలో వంశీ ప్రధాన పాత్ర పోషించారని నమ్మి ఆయనపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు పంపారు. దాదాపు వారం రోజులుగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఆయనకు ప్రత్యేకంగా ఒకటో నంబర్ బ్యారక్‌ను కేటాయించారు.

జైల్లో వంశీకి కేటాయించిన బ్యారక్‌కు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో ఇతర ఖైదీలెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, బ్యారక్‌ చుట్టూ పరదాలు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. ఇక వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయనకు తాజా అరెస్ట్ తర్వాత మరింత కష్టకాలం ఎదురుకానుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు జగన్ పరామర్శ అతనికి ధైర్యాన్నిస్తుందని, భవిష్యత్తులో పార్టీ తరపున మరింత కీలక పాత్ర పోషించొచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా, జగన్ ఈ సందర్శన అనంతరం ఏమైనా కీలక ప్రకటన చేస్తారా? వంశీ కేసు గురించి ప్రభుత్వ వైఖరి మారుతుందా? అనే ప్రశ్నలపై అందరి దృష్టి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • jagan meets vamshi
  • Vallabhaneni Vamsi Arrest
  • vijayawada sub jail

Related News

Duvvada Jagan

దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది

  • Jagan Assembly

    జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?

  • Jagan Vijay

    జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి

  • 'corrupt' Politics In Ap

    ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd