CBN : చంద్రబాబు చావాలి అంటూ జగన్ శాపనార్థాలు
CBN : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనంలో పయనిస్తోందని జగన్ అన్నారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
- Author : Sudheer
Date : 10-09-2025 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) రాష్ట్రంలో కూటమి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, టీడీపీ ప్రభుత్వ పాలనలో రైతులు రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. కుప్పంలో రైతులు యూరియా కోసం లైన్లో నిలబడిన ఫోటోలను చూపిస్తూ, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించారు. ఈ సందర్భంగా ఆయన “చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చస్తే బెటర్” అని తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.
ISIS Terrorists : రాంచీలో ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
తమ పాలనలో రైతులు యూరియా కోసం ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనూ రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, శాంతిభద్రతలు కరువయ్యాయని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనంలో పయనిస్తోందని జగన్ అన్నారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.