Jagan Delhi Tour : రేపే ఢిల్లీకి జగన్..సడెన్ గా షెడ్యూల్ చేంజ్
ముందుగా ఈ నెల 06 న ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా..కానీ ఇప్పుడు ఎల్లుండి కాకుండా రేపే ఢిల్లీకి బయలుదేరుతున్నారు
- Author : Sudheer
Date : 04-10-2023 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ (Jagan Delhi Tour CHange) షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ఈ నెల 06 న ఢిల్లీ (Delhi )కి వెళ్లాల్సి ఉండగా..కానీ ఇప్పుడు ఎల్లుండి కాకుండా రేపే ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. ఈ రెండు రోజులు జగన్ ఢిల్లీ లోనే గడపనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Central Minister Amit Shah)లతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేపు కాకినాడ జిల్లా సామర్లకోటలో జరగాల్సిన జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఏపీలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఫస్ట్ టైం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. వాస్తవానికి గత నెల 12న లండన్ యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పర్యటన వాయిదా పడింది. గత నెల 21 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత వరుస సెలవులు వచ్చాయి. 6, 7 తేదీల్లో ప్రధాని ఢిల్లీలోనే ఉంటారని.. అందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని తెలుస్తుంది. సీఎం జగన్ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, టీడీపీ జనసేన పొత్తు అంశాలు కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది.
Read Also : Telangana Voters List : తెలంగాణ ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల..మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి