HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Couple Are Key Players In Liquor Scam Congress Leader Manikam Tagore

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పాత్రలు జగన్ దంపతులే – కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్

AP Liquor Scam : ఈ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమేనని, అసలు మాస్టర్ మైండ్‌లు వైఎస్ జగన్, ఆయన భార్య భారతి అని తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Author : Sudheer Date : 20-07-2025 - 5:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Tagur
Jagan Tagur

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమేనని, అసలు మాస్టర్ మైండ్‌లు వైఎస్ జగన్, ఆయన భార్య భారతి అని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ నేతృత్వంలో ఈ స్కాం ఒక ప్లాన్డ్ ఆపరేషన్‌గా అమలయ్యిందని, ఇది టాప్-డౌన్ అవినీతి విధానం అని పేర్కొన్నారు. మద్యం ద్వారా పేదల జీవితాలను నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేసిన ఈ కుట్ర వెనక జగన్ కుటుంబం ఉన్నదని మండిపడ్డారు.

మాణికం ఠాగూర్ వివరించిన ప్రకారం.. విశ్వసనీయ మద్యం బ్రాండ్లను తొలగించి, వైసీపీకి అనుబంధ బినామీలు నడిపించే కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఈ బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించి మేడ్-అప్ లాభాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. ఈ డబ్బు ప్రజల జేబులో నుంచి లాక్కొన్నట్టేనని, ఎన్నికల ఖర్చులకే దాన్ని వినియోగించారని తెలిపారు. ఇన్‌వాయిసులు, షెల్ కంపెనీలు, వేర్‌హౌస్ ఒప్పందాల పేరుతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు.

Drinking Tea: సాయంత్రం వేళ‌లో టీ తాగుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

2020 నుంచి 2024 మధ్యకాలంలో ఈ స్కాం ద్వారా కనీసం రూ. 3,200 కోట్ల నిధులు అక్రమంగా మళ్లించారని మాణికం ఠాగూర్ తెలిపారు. ఈ నిధులను 2024 ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడానికి ఉపయోగించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బూత్‌లు నిర్వహించడానికి, ఓటు కొనుగోలుకు ఈ డబ్బును వినియోగించారని స్పష్టం చేశారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యం బ్రాండ్ల తయారీకి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా, లైసెన్సులు తీసుకొని నకిలీ యూనిట్ల ద్వారా సరఫరా చేసిన తీరు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన చర్యగా పేర్కొన్నారు.

ఇది జగన్‌కు సంబంధించిన మొదటి అవినీతి కేసు కాదని, గతంలో సీబీఐ దాఖలు చేసిన రూ. 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో కూడా ఆయన ప్రధాన నిందితుడని మాణికం ఠాగూర్ గుర్తుచేశారు. 2012లో జగన్ 16 నెలలపాటు జైలులో ఉన్నారు. ఇసుక మాఫియా, మైనింగ్, భూ కేటాయింపులు, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి ఎన్నో అవినీతి వ్యవహారాల తరువాత, మద్యం కుంభకోణం ఆయన అవినీతి ధోరణికి తాజా ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ స్కాంలో బాధితులు రాష్ట్రంలోని కోటి పేద కుటుంబాలే అని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన జగన్‌కు తగిన శిక్ష పడాల్సిన సమయం వచ్చిందని ఠాగూర్ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Liquor Scam
  • Congress party in-charge Manikam Tagore
  • jagan
  • Midhun Reddy arrest
  • ys bharathi

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Raghurama Krishna Raju.

    సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd