Jagan : ఏడాదిలోనే జగన్ దివాలా ..అట్లుంటది బాబుతోని !!
Jagan : ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు తర్వాత కూడా పార్టీలో మార్పులకు ప్రయత్నించకుండా, అసెంబ్లీలో పాల్గొనకపోవడం, ప్రజల సమస్యలపై నోటి దురుసుతో మాత్రమే స్పందించడం
- By Sudheer Published Date - 01:45 PM, Thu - 12 June 25

ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో జగన్ రెడ్డి(Jagan)కి అపారమైన ప్రజాధారాన్ని ఇచ్చినా, ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజల అవసరాలను విస్మరించి, పరిపాలనను ప్రతీకారం, కుల రాజకీయాల వైపు మళ్లించడంతో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా, ప్రతిపక్ష హోదా దక్కలేదనే పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉండడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయ బాధ్యత లేని ప్రవర్తనగా భావిస్తున్నారు. జగన్ తన నేతృత్వంలో పార్టీని అసాంఘిక శక్తిగా మలిచారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రౌడీలకు అండగా నిలవడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై ఒత్తిళ్లు, వేధింపులు కొనసాగించడం, ఇప్పుడు ఓటమి తర్వాత కూడా అలాంటి శైలిని మానకుండా రాష్ట్ర శాంతి భద్రతలకు సవాలు చేయడం ప్రజల్లో ఇంకాస్త వ్యతిరేకతను కలిగిస్తుంది.
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్
తెనాలిలో జరిగిన పరిణామాలూ దీనికి నిదర్శనం. దీనివల్ల జగన్‌పై నేరపూరిత రాజకీయ నేతగా ముద్రపడినట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటివకైనా జగన్ తన ధోరణి ని మార్చుకోకుండా ,అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు తర్వాత కూడా పార్టీలో మార్పులకు ప్రయత్నించకుండా, అసెంబ్లీలో పాల్గొనకపోవడం, ప్రజల సమస్యలపై నోటి దురుసుతో మాత్రమే స్పందించడం ఆయన నాయకత్వంపై నమ్మకాన్ని మరింతగా దెబ్బతీస్తోంది. ఇవన్నీ కలిపితే, జగన్ రెడ్డి నేతృత్వం ఏడాదిలోనే పూర్తిగా రాజకీయ దివాలా తీసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికే ఇలా అయితే మరో నాల్గు ఏళ్లలో జగన్ , & బ్యాచ్ ఏమైపోతారో అని అంత మాట్లాడుకుంటున్నారు.