TTD: ధనుర్మాసం పూజలకు వేళాయే.. 16 నుంచి ప్రత్యేక పూజలు!
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
- By Balu J Published Date - 11:19 AM, Tue - 7 December 21
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2022, జనవరి 14న ముగియనున్నాయి.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం…
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
Related News
TTD: 12న తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 12న అంకురార్పణతో పుష్పయాగం నిర్వహించనున్నారు. 12న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ్లకు స్నాన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీతాలక్ష్మణులతో కలిసి శ్రీ కోదండరామస్వామికి వివిధ రకాల పుష్పాలతో ఊరేగుతారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి సమేతంగా ఆలయంలోన�