YCP Leaders : జనసేన లోకి ‘జగనే’ నేతలను పంపిస్తున్నాడా..?
YCP Leaders : పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు , పాలన నచ్చి చేరుతున్నారా..? లేక జనసేన - టీడీపీ ని విడగొట్టడానికి వస్తున్నారా..? లేక జగనే పంపిస్తున్నారా? అని మాట్లాడుకుంటున్నారు
- By Sudheer Published Date - 01:59 PM, Thu - 26 September 24

జనసేన (Janasena) పార్టీలోకి వైసీపీ నేతలు ‘క్యూ’ కడుతుండడంతో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు (Chandrababu)లను బండబూతులు తిట్టినా వారు ఇప్పుడు జనసేన కండువా కప్పుకోవడం ఏంటి అని అంత ఆలోచనలో పడ్డారు. నిజంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు , పాలన నచ్చి చేరుతున్నారా..? లేక జనసేన – టీడీపీ ని విడగొట్టడానికి వస్తున్నారా..? లేక జగనే పంపిస్తున్నారా? అని మాట్లాడుకుంటున్నారు.
రీసెంట్ గా వైసీపీ(YCP)కి రాజీనామా చేసి..జనసేన లో చేరిన ఒకరిద్దరు నేతలు అప్పుడే టీడీపీ నేతలతో గొడవకు దిగారు. బాలినేని-టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గతంలో టీడీపీతో వైరం ఉన్న నేతలే ఇప్పుడు జనసేన లో చేరుతుండడం తో రాబోయే రోజుల్లో కూటమి చీలడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు గతంలో జగన్ (Jagan) వేసిన ప్లాన్ ను గుర్తు చేసుకుంటున్నారు. 2014-19 మధ్యకాలంలో జగన్ తన పార్టీలోని కొందరు నేతలను టీడీపీలోకి పంపారు. వారి ద్వారా కీలక విషయాలు తెలుసుకుని అలర్టయ్యేవారు. 2019 ఎన్నికల తర్వాత ఆయా నేతలంతా జగన్ గూటికి చేరుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు కూడా అలాగే జనసేన లోకి నేతలను పంపించి..అక్కడ జరుగుతుంది తెలుసుకొని అలర్ట్ కాబోతున్నారా..? అని అంత భవిస్తున్నారు.
ఇదిలా ఉంటె జనసేన నేతల్లో మరికొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో జగన్ ను గద్దె దించేందుకు కూటమి తో పొత్తు పెట్టుకొని టికెట్స్ త్యాగం చేసి..సొంత పార్టీ నేతలకు మొండిచెయ్యి చూపించాడు. ఇప్పుడు వైసీపీ నేతలను చేరుకొని మరోసారి వారికే టికెట్ కేటాయిస్తారా..? అని వారంతా మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి జనసేనను నమ్ముకున్న నేతల మాటేంటి? ఈ విషయంలో పవన్ ఆలోచన ఎలా ఉంటుంది? వారికి న్యాయం చేస్తారా..? అసలు జనసేన లో ఏంజరుగుతుంది..? ఏంజరగబోతుంది..? అంటూ వారంతా అయోమయం అవుతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!
Read Also : Sangareddy : నాలుగు అంతస్తుల అక్రమ భవనాన్ని బాంబ్ పెట్టి కూల్చేసిన అధికారులు