AP Nominated Posts : రెండో దశలో 40కి పైగా కార్పొరేషన్లు పదవులు – చంద్రబాబు
AP Nominated Posts : పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల రెండో దశ నియామకాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు
- Author : Sudheer
Date : 25-10-2024 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) టీడీపీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) భర్తీపై మరింత దృష్టి సారించారు. దీనిలో భాగంగా, ఆయన తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల రెండో దశ నియామకాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇప్పటికే మొదటి దశలో 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను కేటాయించారు. ఇప్పుడు రెండో దశలో కూడా దాదాపు 40కి పైగా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చే యోచనలో ఉన్నారు.
నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) రెండో దశలో ప్రధానాంశాలు:
టీటీడీ బోర్డు, ఇతర దేవాలయ పాలక మండళ్లు, కుల సంఘాలకు చెందిన ఛైర్మన్ పదవులను కేటాయించేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. 2019 నుండి పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందుకోసం సర్వేలు, బ్యాక్ ఆఫీస్ ద్వారా అభ్యర్థుల ఎంపికను పూర్తిగా పరిశీలించారు. బీజేపీ, జనసేనకు కూడా వాటా కేటాయించేలా ప్లాన్ చేయడం జరిగింది. మొదటి లిస్ట్‌లో జనసేనకు మూడు, బీజేపీకి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. రెండో దశలో కూడా ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం. రెండో దఫా నామినేటెడ్ పోస్టుల లిస్ట్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
టీడీపీ సభ్యత్వ నమోదు:
రేపటి నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. రూ.100 ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల భీమా కల్పించాలని నిర్ణయించారు. శాశ్వత సభ్యత్వానికి రూ.1 లక్ష చెల్లిస్తే, శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం.
Read Also : Matti Pramida Deepam : మట్టి ప్రమిదలలో వెలిగించే దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత..