YS Jagan Stone Attack : జగన్ పై రాళ్ల దాడి ఘటనలో పోలీసు అధికారులపై ఈసీ వేటు
ఈ దాడి ఘటన పై ఈసీ సీరియస్ అయ్యింది. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దాడి జరిగిందని ఆగ్రహిస్తూ..ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది
- Author : Sudheer
Date : 23-04-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన దాడి ఘటన ఫై ఈసీ (EC) స్పందించింది. ఈ దాడి నేపథ్యంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా (Vijayawada CP Kanthi Rana Tata), ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (Intelligence Chief PSR Anjaneyulu)ను బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దీ రోజుల క్రితం విజయవాడ లో యాత్ర కొనసాగిస్తుండగా.. సింగ్ నగర్ వద్ద ఆగంతకుడు రాయి విసిరాడు. సమీపంలో ఉన్న స్కూలు భవనం పై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు.
ఆ తర్వాత ఓ రోజు రెస్ట్ తీసుకోని తిరిగి యాత్ర మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడి విషయంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడించింది. మీరంటే..మీరు అంటూ దాడి చేసారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన సిట్ అధికారులు రాయి విసిరినా నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ దాడి ఘటన ఈసీ సీరియస్ అయ్యింది. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దాడి జరిగిందని ఆగ్రహిస్తూ..ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
Read Also : CM Jagan : జగన్ ఉక్కు ప్రామిస్.. రియాలిటీలో తుక్కు ప్రామిస్