AP Elections : ఏపీలో వందల కోట్లు చేతులు మారుతున్నాయి..
ఎన్నికల కోడ్ కూయగానే నోట్ల కట్టలు రాకపోకలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రహస్య ప్రదేశాల్లో ఉంచిన డబ్బును బయటకు తీసుకొస్తున్నారు
- Author : Sudheer
Date : 22-03-2024 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు ఉన్న డబ్బంతా (Money ) బయటకు తీయాల్సిందే..కేవలం దాచుకున్న డబ్బే కాదు అప్పు చేసి కూడా డబ్బులు వెదజల్లాలి..అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేస్తే అంత విజయం వారిని వరిస్తుంది. ప్రస్తుతం ఏపీ (AP)లో అదే జరుగుతుంది. ఎన్నికల కోడ్ (Election Code) కూయగానే నోట్ల కట్టలు రాకపోకలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రహస్య ప్రదేశాల్లో ఉంచిన డబ్బును బయటకు తీసుకొస్తున్నారు. ఒకేసారి భారీగా నగదును తరలిస్తే మొత్తానికే ముప్పు వస్తుందని భావించిన నేతలు భాగాలుగా తరలిస్తున్నారు. కోడ్ అమలులోకి రాగానే అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పో్‌స్టలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల భారీ ఎత్తున నగదును పోలీసులు పట్టుకోగా…తాజాగా విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇంఛార్జ్ గోవింద్ ప్రమణ్ కుమార్, జి.సుబ్బారెడ్డి స్టాటిక్ సర్వియలెన్స్ టీం, గవర్నర్ పేట సీఐ, ఎస్సై సంయుక్తంగా దాడులు నిర్వహించగా…రూ. 26.33 లక్షల నగదు, 2.6 కేజీలు బంగారం, నగదు బంగారం కలిపి 1.6 కోట్లుగా గుర్తించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద పట్టుకున్నారు. కాగా.. అంత డబ్బుకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సీజ్ చేశారు. అనంతరం.. ఐటీ డిపార్ట్మెంట్, జీఎస్టీకి పరిశీలన కోసం సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also : AP : ఏం మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్..ఓ పరదాలు ఉన్నాయ్ కదా – లోకేష్