Home Minister Vangalapudi Anitha : హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి
కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పై నుండి వెళ్లడం తో .. ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి
- Author : Sudheer
Date : 22-06-2024 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతిలో హోం మంత్రి అనిత (Home Minister Vangalapudi Anitha) కన్వాయ్ (Convoy) లో అపశ్రుతి చోటుచేసుకుంది. కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పై నుండి వెళ్లడం తో .. ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తుంది. ఇక అనిత విషయానికి వస్తే..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ కి చెందిన కంబాల జోగుళును 43 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించింది. దీంతో చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దక్కించుకోవడం జరిగింది. మూడు రోజుల క్రితం వెలగపూడి సచివాలయం బ్లాక్-2లో గల ఛాంబర్‌లో ఆమె ఛార్జ్ తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వంగలపూడి అనిత తన క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. న్యూ ఆటోనగర్‌లో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కు చెందిన నాలుగు అంతస్తుల భవనాన్ని ఆమె అద్దెకు తీసుకున్నారు. మంగళవారం తన కుమార్తెతో కలసి గృహప్రవేశం చేశారు. ఇక ఈరోజు అసెంబ్లీ లో అయ్యన్న ను స్పీకర్ గా ఎన్నిక కాబడిన నేపథ్యంలో అస్మేబ్లీ అనిత ప్రసంగించారు.
ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికవడం ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవం, ఉత్తరాంధ్రకు చెందిన తన అదృష్టమని అనిత పేర్కొన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు అభినందనలు తెలియజేస్తూ సభలో మంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అయ్యన్న పాత్రుడును తాతాజీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని చెప్పారు. తన పక్క నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ, తనకు మార్గదర్శకంగా ఉంటూ వస్తున్నారని వివరించారు.
Read Also : Gangula Kamalakar : కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్..?