AP Heavy Rains : ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వార్త..
heavy rains alert ap : ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వార్త..
- By Sudheer Published Date - 09:40 AM, Fri - 11 October 24
ఏపీని భారీ వర్షాలు (AP Heavy Rains) వదలడం లేదు. గత కొద్దీ రోజులుగా వర్షాలు బీబత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలు వర్షాలకు నాశనం కాగా ఇప్పుడు ఉన్న కొద్దీ గొప్పను కూడా నాశనం చేసేందుకు రాబోతున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని..దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనాగా ఉంది. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు.
Read Also : Lip care: గులాబీ రేకుల వంటి పెదవులు కావాలా..? దీన్ని ప్రయత్నించండి..!