RK Roja : రోజా రోత అంటూ మంత్రి సంధ్యారాణి చిందులు
RK Roja : అవినీతి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శిస్తూ “రోత మనుషులు రోతగానే మాట్లాడతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Author : Sudheer
Date : 04-04-2025 - 4:54 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (State Minister Gummidi Sandhyarani) మాజీ మంత్రి వైసీపీ నేత రోజా(Roja)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “రోజా రోత వీడియోలు చేస్తుందని మావాళ్లు చెప్పారు. అలాంటి రోత మనిషిపై మేమేం మాట్లాడాలి, మాకు టైమ్ వేస్ట్” అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సంధ్యారాణి.. రోజా ప్రస్తావన తీసుకొని ఆమెను ‘రోత మనిషి’గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఎద్దేవా చేశారు.
Budget session : లోక్‌సభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు..
రోజా క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన సంధ్యారాణి, ఈ అవినీతిలో షాప్ చైర్మన్ బైరెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ అవినీతిపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అవినీతి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శిస్తూ “రోత మనుషులు రోతగానే మాట్లాడతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతూ.. ఈ పథకంపై వైసీపీ నేతలు, ముఖ్యంగా రోజా అనవసరంగా అనుమానాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం ద్వారా ప్రతి తల్లికి మేలు జరగనుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి కూడా త్వరలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని సంధ్యారాణి హితవు పలికారు.