Pushpa Dialogue : వైసీపీ అంత రాఫ్ఫా..రాఫ్ఫా అంటుంటే..గుడివాడ అమర్‌నాథ్ ఎక్కడ..?
Pushpa Dialogue : ఒకప్పుడు టీడీపీ, జనసేన నేతలపై నిప్పులు చెరిగిన గుడివాడ.. ప్రస్తుతం పూర్తిగా మీడియా దూరంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది
- By Sudheer Published Date - 04:51 PM, Sun - 22 June 25

గత ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీలో కీలక నేతగా ఉన్న గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath ) వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు టీడీపీ, జనసేన నేతలపై నిప్పులు చెరిగిన గుడివాడ.. ప్రస్తుతం పూర్తిగా మీడియా దూరంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, గళమెత్తే నేతగా వెలుగొందిన గుడివాడ తాజాగా పార్టీ కార్యాచరణల్లో పాల్గొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Pawan Kalyan : పంచకట్టులో పవన్ ఏమన్నా ఉన్నాడా..?
వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలపై గుడివాడ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని విశాఖ వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాను ఆశించిన విశాఖ నగర నియోజకవర్గ ఇంచార్జ్ పదవి దక్కకపోవడం, పైగా తనకు చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆయన అసంతృప్తి ముదిరినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా గుడివాడను తప్పించడం ఆయనకు మరింత నిరాశ కలిగించిందట. గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన గుడివాడ, ఎన్నికల తర్వాత విశాఖలో సాకే హామీ కోరినా పార్టీ నుంచి ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడం వల్ల పార్టీ కార్యక్రమాల నుండి పూర్తిగా దూరంగా ఉన్నారు.
Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం
మునుపటి హంగు లేకుండా గుడివాడ ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం, పార్టీలోనే ఆయనపై “సినిమా అయిపోయిందంటూ” చర్చలు జరగడం విశేషం. మంత్రి పదవిలో ఉన్నప్పుడు సీనియర్లను లెక్కచేయని ఆయన వైఖరిపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉండి, గౌరవప్రదమైన పదవులనుంచి తక్కువ ప్రాధాన్యత గల బాధ్యతలకు మార్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తనకు మళ్లీ పురోగతి అవకాశాలు రావచ్చన్న ఆశతో గుడివాడ పార్టీ నుంచి బయటకు రాకుండా ఓపికగా ఎదురు చూస్తున్నారట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గుడివాడ రాజకీయ భవితవ్యం ఏదో వేచి చూడాల్సిందే.