Gorantla Madhav : పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్
Gorantla Madhav : ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టును అభ్యర్థించగా, న్యాయస్థానం రెండు రోజులకే అనుమతి ఇచ్చింది
- By Sudheer Published Date - 10:43 PM, Mon - 21 April 25

వైసీపీ కి చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు మొబైల్ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టును అభ్యర్థించగా, న్యాయస్థానం రెండు రోజులకే అనుమతి ఇచ్చింది. ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు గోరంట్ల మాధవ్‌ను విచారించనున్నారు.
ఇటీవల గోరంట్ల మాధవ్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 10న, మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే కస్టడీలో ఉన్న కిరణ్‌ను గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా, గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో మాధవ్ నేరుగా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి కిరణ్‌పై దాడికి ట్రై చేసాడు.
Drunk Man : తాగిన మత్తులో ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన మందుబాబు
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా వారిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులకు కోర్టు రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అంతేకాదు, మాధవ్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం మాధవ్ జైలులోనే ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై కూడా వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో మొత్తం 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనితో పాటు ఈ కేసులో పోలీసుల ప్రవర్తన, చర్యలపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న చర్చ కొనసాగుతోంది. గోరంట్ల మాధవ్ రాజకీయ భవిష్యత్తుపై ఈ వ్యవహారం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.