APSRTC: సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ రాయితీ వర్తిస్తుంది.
- By Kode Mohan Sai Published Date - 12:16 PM, Fri - 15 November 24

ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా సీనియర్ సిటిజన్స్ కోసం 25% టికెట్ రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే వర్తిస్తుంది. రాయితీ పొందేందుకు, ఆరు రకాల గుర్తింపు కార్డులను ఆర్టీసీ ధ్రువీకరించింది.
ఈ రాయితీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రకాల ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. అంతేకాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల సీనియర్ సిటిజన్లకు కూడా ఏపీలో 25% రాయితీ లభించనుంది. సీనియర్ సిటిజన్స్ తమ వయస్సుకు సంబంధించిన గుర్తింపు కార్డులను ఆర్టీసీ బస్సుల్లో చూపించి ఈ రాయితీని వినియోగించుకోవచ్చు.
సీనియర్ సిటిజన్స్‌కు ఆర్టీసీ 25% రాయితీ:
ఏపీఎస్‌ఆర్టీసీ సీనియర్ సిటిజన్స్‌కు 25% టికెట్ రాయితీని అందించడానికి, ఆరు రకాల గుర్తింపు కార్డులను వాడాలని సూచించింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఎలాంటి గుర్తింపు కార్డులు అయినా సరిపోతాయని ఆర్టీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఆరు కార్డులు: ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్, పాస్‌పోర్టు, పాన్ కార్డు, మరియు రేషన్ కార్డులు. సీనియర్ సిటిజన్స్ ఈ కార్డులను చూపించి టికెట్లపై రాయితీ పొందవచ్చు. ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

APSRTC Skoch Award 2024
కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు:
ఈ కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సర్వీసులను ప్రారంభించింది. పంచారామక్షేత్రాలకు, అలాగే శ్రీశైలంకు స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుండి ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి.
అలాగే, ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాలకు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో పెట్టింది.