Janasena Formation Day : ట్రెండింగ్లో జనసేన కొత్త పాట
Janasena Formation Day : 'జెండర్.. జెండర్.. జెండర..' ("Gender.. Gender.. Gender..") అనే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది
- By Sudheer Published Date - 10:42 PM, Wed - 12 March 25

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (Janasena Formation Day) పురస్కరించుకుని పార్టీ ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు విడుదల చేసిన ‘జెండర్.. జెండర్.. జెండర..’ (“Gender.. Gender.. Gender..”) అనే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దుంపటి శ్రీనివాస్ రచించిన ఈ పాటకు సింధూ కే ప్రసాద్ సంగీతాన్ని అందించగా, జనసైనికులు, వీరమహిళలు ఈ పాటను భారీగా షేర్ చేస్తున్నారు. పార్టీ ఆశయాలను, ప్రజల కోసం సాగిస్తున్న పోరాటాలను ప్రతిబింబించేలా ఈ పాట రూపొందించబడింది. జనసేన కార్యకర్తలకు మరింత ప్రేరణ కలిగించేలా ఉండటంతో ఇది పార్టీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
KTR : ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
ఇదిలా ఉంటే మార్చి 14న జనసేన పార్టీ ఏర్పాటు దినోత్సవాన్ని ‘జయకేతనం’ (Jayakethanam)గా నిర్వహిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసేన మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ సభ, స్థానిక సంస్కృతి, చరిత్రకు అద్దం పట్టేలా ఉంటుందని, ప్రజలకు మరింత స్పూర్తినిచ్చే విధంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ సభలో ముఖ్యంగా పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్, కార్మికుల సేవా ద్రోణి దొక్కా సీతమ్మ, విద్యా విభాగంలో చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ వంటి మహనీయులను స్మరించుకోవడానికి ప్రత్యేకంగా ముగ్గురు మహానుభావుల పేర్లను సభ ముఖద్వారాలకు పెట్టడం విశేషం. నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని జనసేన విజయానికి ప్రతీకగా అభివర్ణించారు. జనసేన పార్టీ ప్రజల హృదయాలలో అఖండ విజయాన్ని సాధించిందని, ఈ విజయాన్ని ప్రజలతో కలిసి సంబరంగా జరుపుకోవడానికి ఈ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు.