Ganesh Laddu Auction : విజయవాడలో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డు..
Ganesh Laddu Auction Record : ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు
- By Sudheer Published Date - 10:26 AM, Mon - 16 September 24

Ganesh Laddu Auction Record in Vijayawada : గణపయ్య లడ్డు (Ganesh Laddu) కు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియంది కాదు..వినాయక చవితి (Ganesh Chaturthi) అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది స్వామివారికి పెట్టే లడ్డు (Ganesh Laddu ) ప్రసాదం. తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) ఈ లడ్డు ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పలు మండపాల్లో గణపతి లడ్డూకి ప్రత్యేకంగా వేలం పాట సైతం వేస్తారు. దీనిని అధిక ధర పెట్టి భక్తులు కొనుగోలు చేస్తుంటారు.
గణపతి లడ్డుని అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన లడ్డుకి నవరాత్రి తొమ్మిది రోజులు.. స్వామివారి దగ్గర ఉంచి.. నిమజ్జనం రోజున వేలం పాట (Ganesh Laddu Auction) వేస్తారు. గణపతి లడ్డుని ఇతరులకు దానం చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వారి కుటుంబం సుఖసంతోషాలతో..అన్నింటా విజయం సాదిస్తుంటారని పురాణాలు చెపుతాయి. లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్న వారే కాకుండా.. దానిని ఇతరులకు పంచి పెట్టడం వళ్ల.. స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరు గణపయ్య లడ్డు ను దక్కించుకోవాలని చూస్తుంటారు. ఇందుకు డబ్బును ఏమాత్రం లెక్క చేయకుండా లక్షల్లో వేలంపాట పాడి లడ్డును దక్కించుకుంటుంటారు.
ప్రస్తుతం గణపయ్య గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పల్లెలు నుంచి నగరాల వరకు వెలసిన వినాయకుడు నిమజ్జనాలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలుచోట్ల నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డు వేలం పాటలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడ రూరల్ నున్న పంచాయతీ (Nunna Ganesh Laddu Auction) పరిధిలోని శ్రీసాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్‌మెంట్ (Srisai Balaji N Clave Apartment) లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందు నిర్వహించిన వేలంలో ఓ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తానికి లడ్డును సొంతం చేసుకోవడం హైలెట్ గా నిలుస్తుంది.
అలాగే హైదరాబాద్ మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏటా వేలం పాటలో టాప్ లో ఉంటే బాలాపూర్ లడ్డును కూడా వెనక్కి నెట్టిన మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డు… ఈ ఏడాది ఏకంగా రూ. 29 లక్షలు పలికింది. ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు లడ్డు సొంతం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని గణేష్ అన్నారు.
Read Also : Elon Musk : కమల, బైడెన్‌లను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు : ఎలాన్ మస్క్