Tirumala Leopard : తిరుమలలో మరో చిరుత చిక్కింది.. రెండువారాల్లోనే మూడు చీతాలను పట్టేశారు !
Tirumala Leopard : మరో చిరుత దొరికింది. గత కొన్ని రోజులుగా తిరుమల నడక మార్గంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు బంధించారు.
- Author : Pasha
Date : 28-08-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Tirumala Leopard : మరో చిరుత దొరికింది. గత కొన్ని రోజులుగా తిరుమల నడక మార్గంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు బంధించారు. ఆదివారం రాత్రి ఏడో మైలు వద్ద బోనులో చిరుత చిక్కిందని వెల్లడించారు. ఇకపై నడక మార్గంలో భక్తులకు ఎలాంటి భయం ఉండబోదని తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్లు సాంకేతికతను ఉపయోగించి, ట్రాప్ కెమెరాలను అమర్చి చిరుత జాడను తెలుసుకున్నారు.
Also read : Today Horoscope : ఆగస్టు 28 సోమవారం రాశి ఫలాలు.. వారికి శ్రమ పెరుగుతుంది
అది గత వారం రోజుల్లో చాలాసార్లు బోను వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. వారం రోజులు ముప్పుతిప్పలు పెట్టిన తర్వాత చివరకు ఏడో మైలు వద్ద బోనులో (Tirumala Leopard ) పడిపోయింది. గతంలో ఆగస్టు 17న ఒక చిరుతను, ఆగస్టు 14న మరో చిరుతను, జూన్ 24న ఇంకొక చిరుతను అటవీ అధికారులు బంధించడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా ఆదివారం రాత్రి దొరికింది నాలుగో చిరుత. ఈమధ్య ఓ ఎలుగుబండి కూడా ట్రాప్ లో పడింది.