Gorantla Madhav Video : గోరంట్ల వీడియో ఒరిజినల్ కాదు.. ఫోరెన్సిక్ నివేదికలో ఏముందంటే..
కొంతకాలంగా వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది.
- Author : Hashtag U
Date : 10-08-2022 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో ఒరిజినల్ కాదని, మార్ఫింగ్ చేసిందని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని, ఒరిజినల్ వీడియో దొరికే వరకూ ఏ విషయం చెప్పలేమని అన్నారు.4వ తేదీ అర్ధరాత్రి 2.07 గంటలకు మొదటగా ఐటీడీపీ గ్రూప్‌లో వీడియో పోస్ట్ అయిందని, అది విదేశాలకు చెందిన నంబర్ నుంచి వచ్చినట్టు వెల్లడించారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తదుపరి విచారణ చేస్తామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందా లేదా అనేదానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని, బాధితులు కంప్లయింట్ ఇచ్చే వరకు ఎంపీ మొబైల్ డేటాను పరిశీలించే హక్కు తమకు లేదని చెప్పారు.
