YCP EX MP : ప్రముఖ నటి తో గోవా లో చిల్ అవుతున్న వైసీపీ మాజీ ఎంపీ ..?
ప్రస్తుతం ఈయన గోవా లో చిల్ అవుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ గా మారాయి. అది కూడా ఓ సీరియల్ నటి తో ఈయన అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ వీడియో చక్కర్లు కొడుతుంది
- By Sudheer Published Date - 02:30 PM, Sun - 21 July 24

గడిచిన ఐదేళ్లలో వైసీపీ(YCP)కి చెందిన పలువురు నేతలు నిత్యం మీడియా లో కనిపించేవారు. అదేదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం..ఈ ప్రాజెక్ట్ లు తీసుకొచ్చాం..ఆ ప్రాజెక్ట్ లు తీసుకొచ్చాం..ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం…ప్రజలకు ఇది చేస్తున్నాం..అది చేస్తున్నాం,,అని కాదు, అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విమర్శలు , ఆరోపణలు చేసేందుకే మీడియా ముందుకు వచ్చారు తప్ప ప్రభుత్వం కార్యక్రమాలతో కనిపించింది చాల తక్కువ. పేర్ని నాని , రోజా , సజ్జల , గుడివాడ అమర్ నాధ్ అంబటి, కొట్టు సత్యనారాయణ , కొడాలి నాని, నందిగామ సురేష్ లతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నిత్యం మీడియా ముందు కనిపించేవారు. ఇక ఇప్పుడు మీడియా కాదుకదా..కనీసం కార్యకర్తలు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో అందరు సైలెంట్ అయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడితే కేసులు పెడతారో అని చాలామంది రాష్ట్రం వదిలివెళ్లారు. అలాంటి వారిలో నందిగామ సురేష్ (Nandigam Suresh) ఒకరు.
We’re now on WhatsApp. Click to Join.
అధికారంలో చేతిలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు , భూ దందాలకు పాల్పడిన ఈయన..ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఈయనపై పిర్యాదులు చేయడం తో కోర్ట్ నోటీసులు పంపింది. తనపై జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు అవాస్తవం. కాబట్టి ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు. ఈ విచారణ కోర్టులో జరుగుతున్నది. రూల్స్ ప్రకారం ఈ కేసును విచారించాలని అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈయన గోవా లో చిల్ అవుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ గా మారాయి. అది కూడా ఓ సీరియల్ నటి తో ఈయన అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. మరి నిజంగా సీరియల్ నటితో వెళ్లాడా..? లేక అక్కడ ఈమె కలిసిందా..? సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియో ఇప్పటిదా..లేక పాతదా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
గోవాలో ఒక సీరియల్ నటితో ఎంజాయ్ చేస్తున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్…
అక్రమ ఆస్తుల కేసులో CRDA మరియు సిట్ IT అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే గోవా పారిపోయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్…#StopWhatYouStartedFekuJagan #YCPFakeBrathuku #YcpCriminalPolitics #YSRCPRowdyism… pic.twitter.com/Wy41XvqDMv
— Mr Yash (@YashTDP_) July 20, 2024
Read Also : Google Pixel 9 Pro Fold: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే?