Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనలో ఆ ఇద్దర్ని సస్పెండ్ చేసిన సీఎం
Tirupati Stampede Incident : డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
- Author : Sudheer
Date : 09-01-2025 - 6:39 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన బాధ్యతా రాహిత్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న పవన్
తొక్కిసలాట నివారించాల్సిన ముఖ్య బాధ్యత కలిగిన ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సిఎస్ఓ శ్రీధరిపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన భక్తుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సమర్థమైన వ్యవస్థను ఏర్పరచాలని, టోకెన్ జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోపక్క ఈ ఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్నా బాధ్యతగా వ్యవహరించరా అంటూ నిలదీశారు. ‘ప్రభుత్వానికి ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకువచ్చారు. మీరు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి’ అని కోరారు.
చాలా సార్లు వచ్చాం ఎప్పడూ ఇలా జరగలేదు మీరు ఉన్నప్పుడు చాలా బాగుంది.. మళ్ళీ పాత పద్దతి విధానాన్ని తీసుకొస్తాం ధైర్యంగా ఉండండి..#ChandrababuNaidu #ttdstampede #Tirumala #HashtagU pic.twitter.com/HOJe6ZS946
— Hashtag U (@HashtaguIn) January 9, 2025