AP Liquor Policy Case : మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు – సుప్రీంకోర్టు
AP Liquor Policy Case : ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించలేదని అభిప్రాయపడింది
- By Sudheer Published Date - 02:38 PM, Tue - 13 May 25

ఆంధ్రప్రదేశ్ మద్యం విధానానికి సంబంధించిన కేసు(AP Liquor Policy Case )లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YSRCP MP Mithun Reddy)కి సుప్రీంకోర్టు( Supreme Court)లో ఊరట లభించింది. గతంలో ఆయన ముందస్తు బెయిల్ (Anticipatory bail) కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ నుంచి నెగటివ్ సమాధానం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మళ్లీ హైకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశించింది.
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తులకు ఇంకా మూడే రోజులు గడువు
అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు స్పష్టంగా తెలిపింది. ఈ కేసులో మిథున్ రెడ్డి నేరుగా సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. విచారణ లేకుండానే, లేదా తగిన ఆధారాలున్నప్పుడే అరెస్టు చేయాల్సిందిగా పేర్కొంది. కేసు నమోదు అయిన వెంటనే యాంత్రికంగా అరెస్టులు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అరెస్టు చర్యలు చట్టబద్ధంగా, సమర్థవంతమైన ఆధారాల ఆధారంగా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇంతటి కీలక కేసులో మిథున్ రెడ్డి సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఆయన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు మరోసారి సమగ్ర విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ కేసును తిరిగి పంపించింది. దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.