CBN : రాజమౌళి ప్లేస్ లో త్రివిక్రమ్ ను తీసుకున్నారా..?
అమరావతి డిజైన్ కు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని , అలాగే త్రివిక్రమ్ ను పిలిపించారా..? వారితో కొత్త డిజైన్ చేయిస్తున్నారా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారుamaravati new design
- By Sudheer Published Date - 05:06 PM, Mon - 15 July 24

భారీ మెజార్టీ తో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ (AP NDA Govt) ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలు ప్రకటించింది కూటమి..ఆ ప్రకటించిన హామీలన్నీ నెరవేరాలంటే వేల కోట్ల డబ్బు కావాలి. రాష్ట్ర ఖజానా చూస్తే కనీసం ఉద్యోగులకు జీతాల అంత లేవు..ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నీ ఎలా నెరవేరుస్తుంది అనేది డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అమరావతి ని రాజధానిగా ప్రకటించారు. భారీ కట్టడాలు సైతం నిర్మించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ (YCP) అమరావతిని వదిలేసింది..అలాగే రాష్ట్ర అభివృద్ధిని సైతం పక్కకు పెట్టింది. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి అవన్నీ బాగు చేయాలి.
We’re now on WhatsApp. Click to Join.
ఐదేళ్లు అమరావతి (Amaravathi)ని వదిలేసే సరిగా అడవిని తలపిస్తుంది. ఆ ప్రాంతంలో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడానికి టెండర్లను ఆహ్వానించింది. నెల రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా నిర్దేశించిన పనిని పూర్తిచేయాలనీ పేర్కొంది. ప్రస్తుతం వారు ఆ పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో అమరావతి కోసం సరికొత్త ఆలోచనలతో సరికొత్త డిజైన్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram), ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai) ఏపీకి రావడం తో డై గురించే అని అంత మాట్లాడుకుంటున్నారు.
అమరావతి డిజైన్ కు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని , అలాగే త్రివిక్రమ్ ను పిలిపించారా..? వారితో కొత్త డిజైన్ చేయిస్తున్నారా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గతంలో అమరావతి కోసం ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ని సంప్రదించారు. రాజమౌళి ఐడియా లతో చాల చేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ ను రంగంలోకి దించుతున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది ఆనంద్ సాయి అనే తెలిసిందే. అందుకే ఇప్పుడు అమరావతి కోసం ఆయన్ను పిలిపించు ఉంటారు.
Read Also ; Prabhas : ప్రభాస్ హను మూవీ టైటిల్ అదేనా..!