HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Devineni Avinash Fires On Bonda Uma

TDP vs YCP : టీడీపీ నేత బొండా ఉమాపై దేవినేని అవినాష్ ఫైర్‌.. చిల్ల‌ర వ్య‌క్తంటూ కామెంట్స్‌

టీడీపీ నేత బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై విజ‌య‌వాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ

  • Author : Prasad Date : 30-12-2022 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bonda Vs Devineni Imresizer
Bonda Vs Devineni Imresizer

టీడీపీ నేత బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై విజ‌య‌వాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ చిల్ల‌ర వ్య‌క్తంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. బోండా ఉమా కుటుంబం గురించి, పెంపకం గురించి చెప్పాలంటే చాలా ఉందని..తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమా అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. కోగంటి సత్యం, ఐలపురం వెంకయ్య దగ్గర డ్రైవర్ గా పని చేసి కాళ్ళు నొక్కి చివరికి వారినే మోసం చేశాడ‌న్నారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే బోండా ఆగడాలపై విచారణ చేసింది వాస్తవం కాదా అని దేవినేని అవినాష్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని బోండా ఉమా బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని.. బైక్ రేసులు, కారు రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చింది బోండా ఉమా, ఆయన కుమారులేన‌ని తెలిపారు. మంత్రి పదవి కోసం చంద్రబాబు ను బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర బోండా ఉమదని విమ‌ర్శించారు. కాపుల గొంతు చంద్రబాబు కోసారు అని అప్పట్లో బోండా ఉమా అన్నార‌ని.. మంత్రి పదవి కోసం బ్లాక్ మెయిల్ చేస్తే చంద్రబాబు పిలిచి కబ్జాల లిస్ట్ చూపించి ఉమాకు వార్నింగ్ ఇచ్చారని దేవినేని అవినాష్ తెలిపారు.

ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టే జగన్ నుంచి త‌న‌కు ప్రోత్సాహం ఉందన్నారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం గురించి కానీ.. తమ గురించి కానీ మాట్లాడితే తాట తీస్తామ‌ని దేవినేని అవినాష్ హెచ్చ‌రించారు. గతంలో ఒకటవ డివిజన్ లో మహిళలు రోడ్డు మీద చెప్పులతో కొట్టిన విషయం బోండా ఉమ గుర్తుoచుకోవాల‌ని.. మరో సారి నోరుజారి మాట్లాడితే అదే రిపీట్ అవుతుందని హెచ్చ‌రించారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. చనిపోయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా దేవినేని నెహ్రు ను ఇప్పటికి టార్గెట్ చేస్తున్నారన్నారు. కోర్టు కేసు కూడా కొట్టేసిన విషయం అందరూ తెలుసుకోవాల్సి ఉందని.. ఇకపై నెహ్రు పేరు ఈ విషయంలో ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామ‌ని దేవినేని అవినాష్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bonda uma
  • Devineni Avinash
  • tdp
  • vijayawada
  • ycp

Related News

'birla New'

‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

దక్షిణ భారత మార్కెట్‌పై బిర్లా న్యూ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు విజయవాడను ఎంచుకోవడమే నిదర్శనం. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్‌ను నెలకొల్పిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారులకు నేరుగా చేరువయ్యేందుకు

  • Featherlight

    Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

  • Ntr Sr

    NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

Latest News

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

  • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd