HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Data Theft Panel To Table Report In Ap Assembly Today

Data Theft Issue: చంద్రబాబు హయాంలో డేటా చోరీపై స్పీక‌ర్‌కు నివేదిక…నేడు అసెంబ్లీలో చర్చ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై శాస‌న‌స‌భ‌కు హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది.

  • Author : HashtagU Desk Date : 20-09-2022 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Assembly
Andhra Assembly

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై శాస‌న‌స‌భ‌కు హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది.
శాసనసభ గ్రంథాలయ హాల్‌లో హౌస్‌ కమిటీ సోమవారం సమావేశమైంది. హౌస్ క‌మిటీ చైర్మ‌న్‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స‌భ్యులు పార్థసారథి, అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు. పెగాసస్ తో పాటు ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యంపై కమిటీ చర్చించింది. గతంలో రెండుసార్లు సమావేశమైన ఈ క‌మిటీ డేటా చౌర్యం జరిగినట్లు నిర్దారణకు వచ్చింది. వైసీపీ నాయకుల డేటా పలు ఐపీ అడ్రస్‌లకు వెళ్లినట్లు కమిటీ గుర్తించింది. దీనికి సంబంధించి 85 పేజీల నివేదికను భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అందజేశారు.

ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేసినట్లు చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగవలసి ఉందన్నారు. ఈ నివేదికపై ఈ రోజు శానసభలో చర్చించే అవకాశం ఉందని జ‌క్కంపూడి రాజా చెప్పారు. శాసనసభ గత బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఫోన్ ట్యాపింగ్‌‌పై దుమారం చెలరేగింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం జ‌రిగింది. చివ‌ర‌కు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం భూమన కరుణాకర రెడ్డిని చైర్మన్ గా హౌస్ క‌మిటీని ఏర్పాటు చేశారు.

రాజ‌కీయ ల‌బ్ది కోసం గ‌త ప్ర‌భుత్వం డేటా చౌర్యానికి పాల్ప‌డిన‌ట్లు హౌస్ క‌మిటీ ఆరోపించింది. చంద్ర‌బాబు, లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే వ్య‌క్తుల డేటా ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లిన‌ట్లు చెప్పింది. అప్ప‌టి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశంతోనే కుట్ర జ‌రిగింద‌ని క‌మిటీ స‌భ్యులు ఆరోపించారు. సేవామిత్ర అనే అప్లికేష‌న్ ద్వారా 30 నుంచి 40 ల‌క్ష‌ల మంది డేటాను సేక‌రించిన‌ట్లు కమిటీ తేల్చింది. గ‌త ప్ర‌భుత్వంలో ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి విజ‌యానంద్, ఆర్టీజీఎస్ అప్ప‌టి సీఈవో అహ్మ‌ద్ బాబును కూడా క‌మిటీ విచారించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • chandrababu naidu
  • data theft
  • panel report

Related News

Chandrababu

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu  ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని

  • Chandrababu Naidu Job Calen

    ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

Latest News

  • జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

  • ఇండియన్ నేవీలో 260 పోస్టులు

  • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

  • జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

  • రియల్ ఎస్టేట్ ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd