BRS Operation: ఏపీపై `బీఆర్ఎస్` ఆపరేషన్! కొణతాల, దాడి, జేసీ, డీఎల్ ఆకర్ష్?
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకప్పుడు టీడీపీలో కీలక లీడర్. ఆ తరువాత టీఆర్ఎస్ కు వెళ్లిన ఆయన కేసీఆర్ కోటరీలో
- By CS Rao Published Date - 12:48 PM, Thu - 13 October 22

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకప్పుడు టీడీపీలో కీలక లీడర్. ఆ తరువాత టీఆర్ఎస్ కు వెళ్లిన ఆయన కేసీఆర్ కోటరీలో మంత్రిగా ఉన్నారు. అందుకే, బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొందరు లీడర్లను రెండు రోజుల క్రితం ఆయన అప్రోచ్ అయ్యారని టాక్.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన సామాజిక ఈక్వేషన్లను ఒక వైపు చూసుకుంటూనే లీడర్లను ఎంపిక చేసే పనిలో శ్రీనివాస్ యాదవ్ ఉన్నారట. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రకు చెందిన కీలక లీడర్ కొణతాల రామకృష్ణ పై ఆపరేషన్ కొనసాగించారని తెలుస్తోంది. అనకాపల్లి మాజీ ఎంపీ కొణతాల. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉత్తరాంధ్రకు సుపరిచయం. ఆయనతో పాటు దాడి వీరభద్రరావును అప్రోచ్ అయినట్టు బీఆర్ఎస్ వర్గాల్లోని వినికిడి.
Also Read: AP Amaravati Politics: ఔను! వాళ్లిద్దరి ఆత్మ జూనియర్!
రెండు ఫార్ములాలను ఎంచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎంట్రీకి సిద్ధం అయింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న సీనియర్లపై ఆపరేషన్ చేయడం ఒకటి. తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లను ఆకర్షించడం మరో ఎత్తుగడ. ఈ రెండు పద్ధతుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని శ్రీనివాసయాదవ్ కు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఆ దిశగా అడుగులు వేస్తోన్న శ్రీనివాస్ యాదవ్ రాయలసీమలోని పూర్వపు టీడీపీ లీడర్లను టచ్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం కర్నూలు జిల్లా నుంచి కేఈ బ్రదర్స్ చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ వైపు మళ్లిన కోట్ల ఫ్యామిలీ ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్ గా లేదు. కడప జిల్లాలోని డాక్టర్ డీఎల్ రవీంద్రరెడ్డి వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు మీద హోప్స్ పెద్దగా లేవు. ఆ విషయాన్ని బ్రదర్స్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇలా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సీనియర్ల మీద బీఆర్ఎస్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
Also Read: BRS KTR: బీఆర్ఎస్ ఎత్తుగడ! భీమవరంలో కేటీఆర్, గన్నవరంకు వల్లభనేని?
తొలి విడత ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద ఆపరేషన్ ఉండాలని బీఆర్ఎస్ స్కెచ్ వేసిందట. ఆ తరువాత ఉభయ గోదావరి జిల్లాల లీడర్లను ఆకర్షించేందుకు కేసీఆర్ వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ ఆపరేషన్ లో బిజీగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ ఊహించిన దాని కంటే మిన్నగా పాజిటివ్ సంకేతాలను పొందినట్టు బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మొత్తం మీద ఏపీలో ఎంట్రీకి బీఆర్ఎస్ మార్గాన్ని సుగమం చేసుకుంటుందన్నమాట.