HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Sensational Comments

2004 , 2014 Elections : ఓటమికి కారణం నేనే – చంద్రబాబు

2004 , 2014 Elections : 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఓటమికి తానే కారణమని స్పష్టం చేశారు. పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పార్టీని పట్టించుకోలేకపోయానని, ఆ కారణంగానే టీడీపీ ఎన్నికల్లో వెనుకబడ్డట్లు అన్నారు

  • Author : Sudheer Date : 17-03-2025 - 6:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn 2004 2014
Cbn 2004 2014

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తాజాగా అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఓటమికి తానే కారణమని స్పష్టం చేశారు. పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పార్టీని పట్టించుకోలేకపోయానని, ఆ కారణంగానే టీడీపీ ఎన్నికల్లో వెనుకబడ్డట్లు అన్నారు. కొన్ని ముఖ్యమైన పనులు చేయలేకపోయిన బాధ తనలో ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ప్రజలు మళ్లీ మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించగా, 2004లో మాత్రం ప్రజల మద్దతు దూరమైంది. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994లో టీడీపీ గెలిచినప్పటికీ, పార్టీ అంతర్గత విభేదాలతో చివరకు చంద్రబాబు అధినేతగా మారారు. ఆయన పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు పురోగమించడంతో 1999లో ప్రజలు మళ్లీ ఆయనకు అధికారం అందజేశారు. అయితే 2004 నాటికి అభివృద్ధి సమగ్రంగా జరగడం లేదన్న విమర్శలతో పాటు, అధికార వ్యతిరేకత పెరిగిన కారణంగా టీడీపీ ఓటమి పాలైంది.

ఆ తర్వాత రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలు రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు చంద్రబాబు ప్రజల మద్దతును పొందారు. అయితే పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీపై నెగ్లిజెన్స్ పెరిగి, 2019లో ఊహించని పరాజయం ఎదురైంది. 2024 ఎన్నికల్లో జనసేన, బిజెపి తో పొత్తు ఏర్పరచుకొని అఖండ విజయం అందుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2004
  • 2014 Elections
  • CM Chandrababu
  • Cm Chandrababu Sensational Comments

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd