HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Reveals Andhra Pradeshs Debt Figures

AP Debits: ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్కలు తేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టం ఎక్కువని అన్నారు. అసెంబ్లీలో ఆయన అప్పుల లెక్కలు వెల్లడించారు, మొత్తం అప్పు ₹9 లక్షల కోట్లను మించిందని చెప్పారు.

  • Author : Kode Mohan Sai Date : 15-11-2024 - 4:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Debits
Ap Debits

గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. “సంపద సృష్టించే కార్యక్రమాలను తీసుకురాలేకపోయారు, పెట్టుబడిదారులు వచ్చిన వారిని తరిమేశారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై మాట్లాడుతూ, అప్పులపరమైన వివరణలు ఇచ్చారు. “గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పుల బాధ మరింత పెరిగింది,” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వివరాలు:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న అప్పుల వివరణ ఇలా ఉంది.

  • గవర్నమెంట్ అప్పు: రూ. 4,38,278 కోట్లు
  • పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్: రూ. 80,914 కోట్లు
  • కార్పొరేషన్ అప్పు: రూ. 2,48,677 కోట్లు
  • సివిల్ సప్లైస్ కార్పొరేషన్: రూ. 36,000 కోట్లు
  • పవర్ సెక్టార్ అప్పు: రూ. 34,267 కోట్లు
  • అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్డ్స్ అండ్ స్కీమ్స్: రూ. 1,13,244 కోట్లు
  • అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్: రూ. 21,980 కోట్లు
  • నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్: రూ. 1,191 కోట్లు

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు: రూ. 9,74,556 కోట్లు

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #apassemblysessions2024 #APBudget2024 #HashtagU pic.twitter.com/KlwiVromSb

— Hashtag U (@HashtaguIn) November 15, 2024

ప్రస్తుతం రాష్ట్రం అప్పుల బారిన పడినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. “ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,74,556 కోట్ల అప్పు తేలింది,” అని ఆయన వెల్లడించారు. అదే సమయంలో, రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “రూ.431 కోట్లతో ఇంత పెద్ద ప్యాలెస్‌ కట్టడం అవసరమా?” అని ప్రశ్నించారు. “రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్‌ కట్టడం సబబేనా?” అని చంద్రబాబు మండిపడ్డారు. అదే సమయంలో, “పర్యావరణాన్ని ధ్వంసం చేసి, రుషికొండలో అలా ఒక భారీ ప్యాలెస్‌ కట్టడం ఎంత వరకు సమంజసంగా ఉంటుంది?” అని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుపెట్టిన వివరాలు వెల్లడిస్తూ, “రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసారని, అంతకుమించి ఓ ప్రముఖ పత్రికకు రూ.400 కోట్లు ఇచ్చి ప్రకటనలు వేపించుకున్నారని” అన్నారు. ” 400 కోట్లు దారద్దత్తం చేసే బదులు ఇంకో 100 కోట్లు కలుపుకుని 500 కోట్లతో రోడ్ల సమస్యను కూడా ప‌రిష్కరించొచ్చు,” అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. “గత ప్రభుత్వం రాష్ట్ర ఆస్తులను అమ్మి, అప్పులు తీసుకుని, ఆర్థిక బలహీనతను సృష్టించింది. మా పాలన వచ్చేసరికి, ఏపీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లు మారింది. అప్పులు భారీగా పెరిగిపోయాయి,” అని ఆయన అన్నారు.

“నా దగర డబ్బులు లేవు, కానీ కొత్త ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలతో రాష్ట్రంలో సంపద సృష్టించి, దానిని పేదలకు పంచుతామని వెల్లడించారు. “దేశంలో ఒక్కో నెలకి రూ.33 వేల కోట్ల పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం మనదే. 64.50 లక్షల మంది ప్రజలకు ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెలవారీ జీతాలు ఒకటో తేదీన ఇస్తున్నాం,” అని చంద్రబాబు చెప్పారు.

మద్యం వ్యాపారాన్ని అనుకూలంగా చూసిన గత ప్రభుత్వంపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మద్యం పైనా ఇంత అవినీతి చేస్తారని ఊహించలేదు. మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. చెత్తపైనా పన్ను వేసి అనేక ఇబ్బందులు పెట్టారు. గత ఐదేళ్లు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎన్నో పనులు చేశారు’ అని చంద్రబాబు విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Debits
  • ap debts
  • CM Chandrababu serious On YS Jagan
  • Nara Chandrababu Naidu
  • ys jagan

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd