CM Chandrababu : గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాల పై చర్చ
CBN : రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ నజీర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అలాగే దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్‌కు సీఎం వివరించినట్లు
- Author : Sudheer
Date : 29-10-2024 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంగళవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) భేటీ అయ్యారు. తన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari)తో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పారు. ఇటీవలే గవర్నర్ సతీమణి సమీరా నజీర్(Samira Nazir) అస్వస్థకు గురికావడంతో ఆమెను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ నజీర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అలాగే దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తుంది. ఇక నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ అంశాలను సైతం గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది.
Read Also : Royal Enfield Interceptor Bear 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా?