Chandrababu to take Oath : గన్నవరం కు చేరుకున్న మెగాస్టార్ & సూపర్ స్టార్
చిరంజీవి తో పాటు భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు
- Author : Sudheer
Date : 11-06-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ నూతన సీఎం గా రేపు (జూన్ 12) చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , సినీ ప్రముఖులు ఇలా పెద్ద ఎత్తున హాజరుకాబోతున్నారు. అలాగే విదేశీ ప్రతినిధులు సైతం రాబోతున్నారు. ఇప్పటికే పలువురు అతిధులు గన్నవరం కు చేరుకోవడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
వీరిలో మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజనీకాంత్ లు ఉన్నారు. చిరంజీవి తో పాటు భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వేదికపై ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడాలని మెగా ఫ్యామిలీ తో పాటు యావత్ మెగా అభిమానులు , సినీ ప్రముఖులు , పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం మరికొద్ది గంటల్లో తీరబోతుండడంతో ఆ క్షణం ఎప్పడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
సీఎంగా చంద్రబాబు, కీలక పదవితో కొనసాగనున్న పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సామాన్యుల నుంచి అన్ని వర్గాల ప్రముఖులకు ఆహ్వాన లేఖలు అందాయి. సినీ, రాజకీయ, వ్యాపార, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులను భారీగా ఆహ్వనించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఇప్పటికే చిరంజీవి తన కుటుంబ సమేతంగా బేగంపేట నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకొన్నారు. అలాగే రజనీకాంత్ చేరుకున్నారు. మిగితా వారందరూ ఉదయంలోగా విజయవాడకు చేరుకొంటారని సమాచారం.
Read Also : Ramoji Rao : రామోజీ రావు కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి