Ramoji Rao : రామోజీ రావు కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు
- Author : Sudheer
Date : 11-06-2024 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
ఈనాడు గ్రూపుల అధినేత , మీడియా మొఘల్ స్వర్గీయ రామోజీరావు (Ramoji Rao) కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నివాళి అర్పించారు. రీసెంట్ గా రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ తరుణంలో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. రామోజీరావు మరణ వార్త యావత్ ప్రజానీకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రధాని మోడీ దగ్గరి నుండి అనేక రాజకీయ పార్టీల అధినేతలు, రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు తమ సంతాపాన్ని తెలియజేసారు. అలాగే కడసారి ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. రామోజీ ఫిలిం సిటీ లో స్మృతివనం లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మంగళవారం రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎంగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డిలు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుంబంధాన్ని ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ అని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు.
Read Also : Lok Sabha Speaker 2024: లోక్‌సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి