Happy Hours: వైన్ షాపు దగ్గర మందుబాబుల పూజలు…
ఏపీలో వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అధిక ధరలతో తాగలేకపోయిన మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శనివారం నాడు తీపికబురు చెప్పింది.
- By Hashtag U Published Date - 09:31 PM, Sun - 19 December 21

ఏపీలో వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అధిక ధరలతో తాగలేకపోయిన మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శనివారం నాడు తీపికబురు చెప్పింది. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేయడంతో ఏపీ వ్యాప్తంగా మద్యం ధరలు కాస్త తగ్గాయి. దీంతో మద్యంప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైన్ షాపు వద్ద మందుబాబుల పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులను పూర్తిగా నిషేధించింది. వైన్ షాపులను కూడా ప్రభుత్వమే నడుపుతుంది. దీంతో అమ్మాకాల సమయాన్ని కూడా కుదించడంతో మందు తాగేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దీనికి తోడు కొత్త బ్రాండ్లు రావడంతో చాలామంది పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న అది ఎక్కడా అగలేదు. విచ్చలవిడిగా పక్క రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అవుతుంది. అయితే రెండున్నరేళ్ల తరువాత ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో మందుబాబులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.దీంతో వారంతా వైన్ షాపుల ముందు పూజలు నిర్వహిస్తున్నారు.