ChandraBabu vision: బాబు విజన్ నిజం! ఇవిగో బోలెడు ఆధారాలు!
ఎప్పుడైతే ప్రపంచం లో యువత కరువవుతుందో ఉద్యోగాలు మిగిలి పోతాయి. ఆ అవకాశాన్ని మనం అంది పుచ్చుకోవాలి.
- By CS Rao Published Date - 04:05 PM, Sat - 18 February 23

చంద్రబాబు (Chandrababu Naidu) ప్రతిసారీ దేశ యువత గురించి ఒక చిన్నపాటి ప్రసంగం ఇస్తారు. రాబోయే కాలం యువతదే అని, అందులోనూ ముఖ్యంగా భారత్ యువతదని చెబుతారు. రాబోయే కాలం , భవిష్యత్తు గురించి చెబుతాడు ఏమిటి , ఈయనేమైనా దేవుడా ? జ్యోతిష్కుడా ? ఈయనకు ఏమైనా మతి చెడిందా , వయస్సు ఉడికిందా ? అని అనుకునే వారు చంద్రబాబు చెప్పింది ముమ్మాటికి నిజమని ఆలస్యంగా నమ్ముతారు. అదెలాగో చూద్దాం. భారత్ జనాభా ప్రస్తుతం 141 కోట్లకు చేరుకుంది . చైనా జనాభా కూడా కొద్దిగా అంటే ఏ పాతిక యాభై లక్షలో అధికంగా ఉంటుంది అంతే. ఈ ఏడాది ఆఖరికి భారత్ జనాభా సంఖ్య , చైనాను దాటి పోతుంది. ఇక్కడే జాగ్రత్తగా గమనిస్తే చైనాలో వృద్ధుల జనాభా 25 % కు చేరుకుంది. ఇది చైనాకు తలకు మించిన భారంగా మారబోతోంది. ఆర్ధికాభివృద్ధికి జనాభా అవరోధంగా భావించిన చైనా 1980 ప్రాంతంలో ఒకటే సంతానానికి ప్రాముఖ్యత నిచ్చింది . కానీ యువ జనాభా తగినంత నిష్పత్తిలో ఉండడం లేదని గ్రహించి 2016 లో ఇద్దరు పిల్లలకు అనుమతి ఇచ్చింది. అయినా పెరుగుదల కనిపిం చక పోగా 2016 లో ఉన్న 1.79 కోట్ల జననాలు 2021 వచ్చే సమయానికి 96 లక్షలకు పడిపోయింది. దానితో కంగారు పడిన చైనా ముగ్గురు పిల్లల ఉత్పత్తి కి గేట్లు తెరిచింది. కరోనా తో ఇంకా తగ్గిపోయే పరిస్థితి కనబడుతోంది . ఇదే పరిస్థితి లో భారత్ ఇందుకు పూర్తిగా వ్యతిరేక దిశలో వెళుతోంది .
జనాభా పెరుగుతూ 2023 చివరికి చైనాతో సమం చేసే స్తుంది . ఇది ఇలాగే కొనసాగి 2050 వచ్చే పాటికి భారత జనాభా 170 కోట్లకు చేర వచ్చునని అంచనా. ఇక అక్కడి నుండి 2063 వరకు పెరుగుదల మందగించి , అక్కడి నుండి క్షీణించడం మొదలు పెడుతుందట . ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా క్షీణత వేగంగా పడిపోతోంది . ఇక్కడే చంద్ర బాబు చెప్పే దానిలో లాజిక్ ఉంది. ఎప్పుడైతే ప్రపంచం లో యువత కరువవుతుందో ఉద్యోగాలు మిగిలి పోతాయి. ఆ అవకాశాన్ని మనం అంది పుచ్చుకోవాలి. 2063 వరకు మనకా అవకాశం ఉంది. అందుకోసం విద్యలో ప్రభుత్వ , ప్రైవేటున పెట్టుబడులు పెట్టాలి. విదేశీ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక్క అమెరికా అనే చూడకుండా ఎక్కడ అవకాశం ఉందో ఆ దేశం వెళ్ళి చదవాలి. ఉద్యోగాలు సంపాదించాలి. ఆ సంపదను భారత్ కు తరలించాలి. అప్పుడు ఇక్కడ ఉండే వయోవృద్ధుల భారం దేశానికి ఉండదు. అవసరం అయితే ఉన్నత విద్యకు విదే శాలకు ప్రభుత్వమే పంపాలి. ఇక్కడ కులం , మతం , ప్రాంతం , వర్గం చూడ కూడదు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి. విద్యా రంగంలో పెట్టుబడులు పెంచి , మౌలిక సదుపాయాలు కలిపిస్తే ప్రపంచానికే మనం విశ్వ గురువులం అవ్వొచ్చు . అప్పుడు విదేశీయులే మన వద్దకు వచ్చి చదువు కుంటారు. మన భారతీయు లలో , సమస్యను ఇట్టే గుర్తించే చురుకైన మేధస్సు ఉంది . అందుకే విదేశాల్లో మనవారు ఉద్యోగాల్లో , వ్యాపారాల్లో , చదువులో , ఆఖరికి అక్కడి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఐరోపా దేశాల్లో యువత 22 % ఉంటే , మన దగ్గర 35 % ఉంది. కార్మికుల్లో గాని , ఉద్యోగాల్లో గానీ భారత మహిళల ప్రాతినిధ్యం పాకిస్తాన్ , శ్రీలంక , బంగ్లాదేశ్ కంటే తక్కువుగా ఉంది . అది ఇంకా పెరగాలి. యువత నిరు ద్యోగత రేటు భారత్ లో 28 % ఉంటే చైనాలో 20 % , పాశ్చాత్య దేశాల్లో 10 % లోపు ఉంది. ఉద్యోగాలు అంటే సాఫ్ట్ వేర్ , బ్యాంకింగ్ , ఫైనాన్స్ , మీడియా రంగాలవే కాదు. ఇంకా అనేక రంగాలలో ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా విద్య, వైద్యం , పరిశ్రమలు , పట్టణాలు నిర్మించడం , రోడ్లు – వంతెనలు నిర్మించడం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించవల్సి వస్తుంది. అప్పుడు వాటిల్లో లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పలానా ఉద్యోగమే కావాలి అనుకో కుండా ఏదో ఒక ఉద్యో గంలో చేరి , తరువాత కొంత స్థిమిత పడిన తరువాత వేరే మంచి ఉద్యోగాల్లోకి మార వచ్చు. ఎప్పటికప్పుడు మారు తున్న సాంకేతికతను అంది పుచ్చుకుని అప్ డేట్ అవుతూ ఉండాలి. ఐరోపా , అమెరికా దేశాల్లో జననాల రేటు పడిపోతోంది , ఏదో ట్రంప్ లాంటి ప్రాంతీయ వాదులతో కొంత కాలం ఇబ్బందులు ఎదురైనా మన సేవలు , మన మేధస్సు లేనిదే ఆయా దేశాలు ముందుకు వెళ్ళలేవు. భార తీయులు అంటే ఒక బ్రాండ్ , నమ్మకస్తులు , విశ్వాస పాత్రులు , స్నేహశీలురు అని ప్రపంచం గుర్తించక తప్పదు.అందుకే మనం విద్యలో ఎప్పటి కప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సులు చేస్తూ, తదనుగుణంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చు కోవాలి. భారత్ రాబోయే కాలంలో ఆర్ధికంగా నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది. ఈ విషయం కూడా చంద్రబాబు చెబుతారు. ఇప్పటికే ఐదవ స్థానంలోకి వచ్చేసాము.
మోదీ దెబ్బ పడకపోతే ఇప్పటికే మూడో స్థానంలో ఉండే వారం. దేశం ఆర్ధికంగా , బలంగా ఉన్నదీ అంటే ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు , సంపద వల్లే. అవే లేకపోతే ఏ ఆదానీనో , అంబానీనో దేశాన్ని పాలించ వచ్చు , ఆక్రమించుకో వచ్చు . ప్రభుత్వం దగ్గర ఆస్తులు , సంస్థలు లేకపోతే ఆదాయం ఎక్కడి నుండీ వస్తుంది. ఆదాయం లేనిచో ఏమి చేస్తుంది. పాలన , రక్షణ బడ్జెట్ తగ్గిపోతుంది. జీతాలు ఇచ్చుకోలేని స్థితికి ప్రభుత్వం చేరుతుంది. అప్పులు ఇచ్చిన సంస్థలు ప్రభుత్వ ఆస్తులను వశం చేసుకుంటాయి . ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మొత్తం దేశం వెళ్ళిపోతుంది. పూర్వం బ్రిటీష్ వారు వచ్చి దేశాన్ని ఆక్రమించు కున్నట్లుగా కాపిట లిస్ట్ ల ప్రైవేటు సైన్యం వచ్చి దేశాన్ని ఆక్రమిస్తుంది. చైనా ను ప్రపంచ దేశాలు నమ్మే స్థితిలో లేవు , అందుచేత ఆ అవకాశాన్ని భారతీయులుగా మనం అందిపుచ్చు కోవాలి . అందుకే చంద్రబాబు అంటూ ఉంటాడు పిల్లలను కనండి , ఒక్కరితో ఆపవద్దు అని . రాబోయే కొద్ది కాలంలో 50 కోట్ల యువత భారత్ లో ఉంటుంది. ఒకే చోట ఇంత మంది యువత ప్రపంచంలో ఏ దేశానికి లేదని అందులో మెరికల్లాంటి వారు చాలా మంది ఉంటారని , వారు ప్రపంచానికి అవసర మని , కాబట్టి రాబోయే కాలం భారత్ యువతదే అని చంద్రబాబు చాలా సార్లు చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే విద్య కోసం ఎంతైనా ఖర్చు చేసే స్వభావం మన తెలుగు వారిలో ఉంది. ఇదే ముందుగా చంద్రబాబు విజన్ .రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పిన మాటలు నిజమని చెప్పడానికి ఇంత కథ ఉందన్నమాట