June 25 : సరిగ్గా ఇదే రోజు ఏపీలో విధ్వంసకర వైఖరికి బీజం పడింది – చంద్రబాబు
June 25 : అణిచివేత, అరాచకం, ప్రజల హక్కుల హననం జరిగిన ఆ ఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై గాయంగా మిగిలిపోయింది. అలాంటి చీకటి పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు "సంవిధాన్ హత్య దివస్" నిర్వహిస్తున్నారు.
- By Sudheer Published Date - 09:28 PM, Wed - 25 June 25

దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధింపు నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయింది. అణిచివేత, అరాచకం, ప్రజల హక్కుల హననం జరిగిన ఆ ఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై గాయంగా మిగిలిపోయింది. అలాంటి చీకటి పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు “సంవిధాన్ హత్య దివస్” నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఘటనను గుర్తు చేసారు.
God father Malware : అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేస్తున్న గాడ్ ఫాదర్ మాల్వేర్.. బీకేర్ ఫుల్!
కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అప్రజాస్వామిక పాలనకు ఆరంభమైన రోజు ఇదే అని అన్నారు. సరిగ్గా ఆరు ఏళ్ల క్రితం, జూన్ 25, 2019న ప్రజావేదిక భవనాన్ని అకారణంగా కూల్చడం ద్వారా అప్పటి ప్రభుత్వ పాలనలో నియంతృత్వ ధోరణి మొదలైంది. ప్రజల నిధులతో నిర్మించిన, ప్రభుత్వ పనులకు ఉపయోగపడుతున్న భవనాన్ని కూల్చడం ద్వారా విధ్వంసకర వైఖరికి బీజం వేసింది. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులు. తాము చట్టబద్ధంగా పొందిన ఓటు హక్కు ద్వారా ప్రజలు ఆ విధ్వంస పాలకులను కూల్చి కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గట్టి సంకల్పంతో పునర్నిర్మాణ యాత్ర చేపట్టింది. ప్రజావేదిక కూల్చివేత ఘటనకు 6 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా అప్పటి దుస్థితిని గుర్తు చేసుకుంటూ, వికాసం వైపు బలమైన అడుగులు వేయాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా అభివృద్ధికి అంకితంగా పనిచేస్తామని స్పష్టం చేసింది.
#6YearsOfPrajaVedikaDemolition
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక… pic.twitter.com/CS5ZKFqJmC— N Chandrababu Naidu (@ncbn) June 25, 2025