Chandrababu Health Condition : చంద్రబాబుకు గుండెపోటు వచ్చే ప్రమాదం..!
చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబు గుండె పరిణామం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాల్లో సమస్యలున్నాయని
- Author : Sudheer
Date : 15-11-2023 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని ఆయన తరుపు లాయర్లు ఏపీ హైకోర్టు (AP High Court) కు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబదించిన రిపోర్ట్ (Chandrababu Health Condition Report) ను కోర్ట్ కు అంజేశారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.
ఈ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నివేదికలో పేర్కొన్నారు. బాబు కుడి కంటికి ఆపరేషన్ నిర్వహించగా.. కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. 5 వారాల పాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ కూడా ఇచ్చారని , ఈ ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవటంతో పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబు గుండె పరిణామం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని తెలిపారు. బాబుకు తగినంత విశ్రాంతి అవసరమని సూచించారు. షుగర్‌ను అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. స్కిన్ ఎలర్జీకు సంబంధించి కూడా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. గుండె సమస్యతో పాటు ఎలర్జీని కంట్రోల్ చేసేందుకు మూడు నెలల పాటు చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టు కోర్ట్ కు అందించిన రిపోర్ట్ లో తెలియజేసారు.
మరోపక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) లో చంద్రబాబు (TDP Chief Chandrababu ) బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో (AP HighCourt) వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా… సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.
Read Also : TS Polls 2023 : 72 నుండి 78 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం – పొంగులేటి