Chandrababu : చంద్రబాబు కు భారీ ఊరట..
సీఐడీ అధికారుల తరుపున న్యాయవాదులు వేసిన పీటీ వారెంట్లను ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది
- Author : Sudheer
Date : 05-12-2023 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు భారీ ఊరట (Big Relief) లభించింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో సీఐడీ అధికారుల తరుపున న్యాయవాదులు వేసిన పీటీ వారెంట్లను ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది. చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నందున పీటీ వారెంట్లు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవకతవకలు జరిగాయని, ఫైబర్ నెట్ కేసులో పెద్దయెత్తున నిధులు దుర్వినయోగమయిందని ఆరోపిస్తూ ఆ కేసుల్లో సీఐడీ చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. ఆయనను విచారించేందుకు అనుమతిని కోరుతూ పీటీ వారెంట్లు దాఖలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill development scam case)లో బెయిల్ (Bail) ఫై బయటకు వచ్చారు. గత వారం రోజులుగా దైవ దర్శనాలు చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు.. షెడ్యూల్ ప్రకారం నేడు మంగళవారం (డిసెంబర్ 5న) శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసిన చంద్రబాబు.. రానున్న రోజుల్లో శ్రీశైలం మల్లన్న, కడప దర్గా, మేరీమాత చర్చిలను దర్శించుకోనున్నారు. మరోవైపు, తుపాను తీవ్రత కారణంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
Read Also : Cyclone Michaung: మైచాంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే..?