Chandrababu First Signature : చంద్రబాబు మొదటి సంతకం ఆ ఫైల్ పైనేనా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి బాబు నిర్ణయించారని
- By Sudheer Published Date - 10:27 PM, Tue - 11 June 24
ఏపీ నూతన సీఎం గా రేపు (జూన్ 12) చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , సినీ ప్రముఖులతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం రాబోతున్నారు. ఇప్పటికే పలువురు అతిధులు గన్నవరం కు చేరుకోవడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాల్లో విజయడంఖా మోగించి రేపు సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి బాబు నిర్ణయించారని.. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పనకు సంబదించిన ఫైల్ పై కూడా సంతకం పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఆ రెండిటి పై సంతకం చేస్తారా లేదా అనేది చూడాలి.
Read Also : Chandrababu : జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు