Chandrababu Emotional : మరోసారి కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు..
Chandrababu Emotional : సోషల్ మీడియా ట్రోలింగ్ పై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆడవారిని టార్గెట్ చేస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 05:51 PM, Thu - 7 November 24

టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఎమోషనల్ (Chandrababu Emotional) అయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో (Inauguration of GIS Sub Station) చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆడవారిని టార్గెట్ చేస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిపై చేస్తున్న ట్రోలింగ్ పై చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలనే అవసరం ఉందని, దేశంలో అందుబాటులో ఉన్న చట్టాలను ఉపయోగించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ట్రోలింగ్ ద్వారా మదమెక్కిన వ్యక్తులు సమాజంలో కలత రేకెత్తిస్తున్నారని, వారికి సరైన క్రమశిక్షణ అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళ పై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగతీసే ప్రయత్నం చేస్తున్నారని, దేనికైనా హద్దులు ఉంటాయన్నారు. హద్దులు దాటితే మాత్రం శిక్ష తప్పదు… దేశంలో, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తున్నామని, ఆడ బిడ్డలపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టింగులు పెడితే, తాట తీసేలా చట్టాలు రూపొందిస్తామంటూ వైసీపీ నేతలకు , వైసీపీ సోషల్ మీడియా వారికి హెచ్చరించారు.
వైసీపీ పార్టీకి సంబదించిన కొంతమంది అధికారం ఉన్నప్పుడే కాదు..ఇప్పుడు అధికారం లేని సమయంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలపై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. రోజు రోజుకు వీరి ఆగడాలు ఎక్కువైపోతుండడం..వీరికి కొంతమంది పోలీసులు కూడా సపోర్ట్ చేస్తుండడం తో వారికీ అడ్డు అదుపులేకుండా పోతుంది. దీంతో రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో ట్రోల్స్ , నీచమైన పోస్టులు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పోలీసులకు సైతం హెచ్చరికలు జారీ చేసాడు. దీంతో నిన్నటి నుండి వరుసపెట్టి వైసీపీ సోషల్ మీడియా వారిని అదుపులోకి తీసుకుంటూ వస్తున్నారు.
Read Also : Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!