Chandrababu Amaravati Inner Ring Road Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టారీతిలో మార్పులు చేసి..కోట్లు దోచుకున్నారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ.. సీఐడీ కి పిర్యాదు చేసింది
- By Sudheer Published Date - 12:06 PM, Thu - 21 September 23

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case )లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు (AP High Court)లో నేడు విచారణ జరుగగా..ఈ కేసును హైకోర్టు ఈనెల 26 కి వాయిదా వేసింది. హైబ్రిడ్ విధానంలో ఈ కేసు విచారణకు హైకోర్టు అంగీకరించింది. దీంతో చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంత అనుకున్నారు కానీ నిరాశే మిగిలింది.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు (aravati Inner Ring Road) నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టారీతిలో మార్పులు చేసి..కోట్లు దోచుకున్నారని వైసీపీ ప్రభుత్వం (YCP) ఆరోపిస్తూ.. సీఐడీ కి పిర్యాదు చేసింది. దీంతో CID చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also : Pawan Kalyan: మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం: పవన్ కళ్యాణ్
ఈ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన కోర్ట్.. ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development ) కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ACB కోర్ట్ తీర్పు ఇవ్వనున్నది. మరి కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది ఉంది.