HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu At Sit Office

AP : కేవలం లోకేష్ , భువనేశ్వరి లకు మాత్రమే చంద్రబాబును కలిసే అవకాశం ఇస్తున్న పోలీసులు

ఓ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ పార్టీ అధినేత..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 09-09-2023 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn At Sit Office
Cbn At Sit Office

ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను CID అధికారులు అరెస్ట్ చేశారనే వార్త..కేవలం టీడీపీ పార్టీ నేతలనే కాదు ఇతర పార్టీ నేతలను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఓ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ పార్టీ అధినేత..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు కురిపించారు.

ఇక మొదటి నుండి చంద్రబాబు కు అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఏ తప్పూ చేయని జనసేన పార్టీ నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు. అలాంటిది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు దారుణం అని పవన్ అన్నారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా చంద్రబాబు ను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సింది పోలీసులే కదా..? అలాంటిది లా అండ్ ఆర్డర్‌ విషయంలో వైసీపీకి సంబంధమేంటి ? అని పవన్ ప్రశ్నించారు. నాయకుడు అరెస్టైతే.. అభిమానులు రోడ్లపైకి రాకుండా..మద్దతు తెలుపకుండా ఎలా ఉంటారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను ఇళ్లలో నుంచి బయటకు రాకూడదంటే ఎలా..? మీ నాయకులు అక్రమాలు, దోపిడీ చేసినా విదేశాలకు వెళ్లొచ్చు..ఒక నాయకుడు అరెస్టైతే కార్యకర్తలు బయటకురావొద్దా? ఇదేమి ప్రజాస్వామ్యం అని పవన్ ప్రశ్నించారు. తన సంపూర్ణ మద్దతు చంద్రబాబు కు ఇస్తున్నట్లు ఉదయమే తెలిపారు.

ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ..చంద్రబాబు అరెస్ట్ అని తెలిసి..తన షూటింగ్ లకు ప్యాకప్ చెప్పి..ప్రత్యేక విమానంలో విజయవాడ కు చేరుకున్నారు. సిట్ ఆఫీస్ లో చంద్రబాబు ను కలవాలని అనుకున్నప్పటికీ , పోలీసులు మాత్రం పవన్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేశ్‌కు మాత్రమే అనుమతిస్తాం అని తేల్చి చెపుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ సిట్ ఆఫీస్ కు వస్తారా..? లేక వెనుతిరిగి వెళ్తారా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం చంద్రబాబు కుంచనపల్లి సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. సిట్ అధికారులు విచారణ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుండి దాదాపు 11 గంటపాటు చంద్రబాబు జర్నీ చేయడంతో కాసేపు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • CID
  • Lokesh
  • Pawan Kalyan
  • SIT office
  • Skill Development Case

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd