TDP-JSP : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్
- By Kavya Krishna Published Date - 10:52 AM, Thu - 7 March 24

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్అతో వీరు భేటీ కానుండగా.. రాష్ట్రంలో BJPతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అటు నిన్న బాబు-పవన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ భేటీలో కూటమికి సంబంధించిన చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పటికీ పొత్తుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. నేటి భేటీలో కూటమిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరో వైపు, ఇప్పటికే తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి ఇప్పుడు రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా బుధవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ అక్కడ బీజేపీతో పొత్తుపై, రెండో జాబితా అభ్యర్థులపై సుమారు గంటన్నరపాటు చర్చించినట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో, బిజెపికి నాలుగు సీట్లు ఇవ్వడానికి టిడిపి అంగీకరించింది, అయితే బిజెపి కనీసం 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని కోరుకుంటుంది, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 15 సీట్లు కోరుతుంది. “పార్టీ కనీసం ఆరు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంటుంది. రాష్ట్రంలో కనీసం రెండు నుండి మూడు సీట్లు గెలుచుకోగలమన్న విశ్వాసం ఉంది” అని బిజెపి వర్గాలు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపాయి.
టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ 2018లో దాన్ని చేజార్చుకుంది. ఆ పార్టీ బంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, జగన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నందున బీజేపీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అనేక కీలక బిల్లులను ఆమోదించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటులో బిజెపికి మద్దతు ఇచ్చింది.
Read Also : TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం