HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu And Jagan Have Compromised The Interests Of The Ap State Ys Sharmila

YS Sharmila: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: వైఎస్ షర్మిల

  • Author : Balu J Date : 21-01-2024 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila (1)
Ys Sharmila (1)

YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలిరోజే టీడీపీ, వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పు చేస్తే.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్‌ రూ.3లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. అన్ని బకాయిలు కలిపితే రాష్ట్రంపై రూ.10లక్షల కోట్ల భారం ఉందని అన్నారు. ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

విజయవాడలో కనీసం ఒక మెట్రో కూడా వేయించలేకపోయారని షర్మిల విమర్శలు చేశారు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని దుస్థితి తీసుకొచ్చారంటూ పాలకులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా దోచుకోవడం.. దాచుకోవడం జరుగుతున్నాయని అన్నారు. ఇటు చంద్రబాబు, అటు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనీ.. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు ఏనాడూ ఉద్యమం చేయలేదని అన్నారు. పైగా ఉద్యమం చేసేవారిని జైలులో పెట్టారని ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహారదీక్షలు చేశారు.. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తలేదని అన్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ, వైసీపీని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • chandrababu naidu
  • hard comments
  • ys sharmila

Related News

Telugu Desam Party Appoints

NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్‌ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd