HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandraba Speech At Prakasham Markapuram

Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Author : Kavya Krishna Date : 31-03-2024 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandra Babu (1)
Chandra Babu (1)

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు. బాబాయిని చంపే వాళ్లు, కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లులో డబ్బులు పంపే వాళ్లు మీకు కావాలా అని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల నాయకులు కలిసి తొక్కుకుంటూ ముందుకు వెళ్దామని, 43 నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్య మంత్రి ని చూడలేదన్నారు చంద్రబాబు. పార్లమెంట్ లో ముస్లీం బిల్లులు తీసుకువస్తే జగన్ సపోర్టు చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని, అబ్దుల్ సలాంని వేధించడంతో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు చంద్రబాబు. ఉర్థుని రెండో భాషగా మార్చింది నేనే అని, హైదరాబాద్, కర్నూల్ లో ఉర్థూ యూనివర్సీలు పెట్టానని ఆయన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఐదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా…మార్కాపురంలో నేనే సవాల్ విసురు తున్నాను…జగన్ సమాధానం చెప్పాలని, ప్రజలు గెలవాలంటే కూటమి గెలవాలన్నారు చంద్రబాబు. ఈ రోజు మనం రాతియుగంలో ఉన్నామని, నా ప్రయాణం స్వర్ణయుగం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేనే ఒక డ్రైవర్ గా పని చేస్తాను.. మా బస్సులో ఎక్కిన వాళ్లు సురక్షితంగా గమ్యం చేరుతారని, గతంలో నా పాలన… ఇప్పడు జగన్ పాలన చూశారు.మనకి కావాల్సింది మతం, కులం, ప్రాంతం కాదు. మన కులం అని ఓటేస్తే కరెంట్ ఛార్జీలు పెంచకుండా మానేశాడు. మన మతం వాడని ఓటేస్తే లిక్కర్ రేటు తగ్గించాడా. మన ప్రాంతం వాడని ఓటేస్తే నిత్యావసర వస్తువల ధరలు తగ్గించాడా.. హైదరాబాద్ ని తెలుగు జాతి కోసం అభివృద్ది చేశా. హైటెక్ సిటీ, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారని అడిగితే నా పేరు చెబుతారు. జగన్ బటన్ నొక్కే కొద్ది ప్రజలకు కష్టాలు పెరుగుతుంటాయి.

తాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ ప్రభుత్వం ప్రజల్ని ఉద్దరిస్తుందా.. రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Srinivasulu Reddy)కి…మరో బటన్ కందుల నారాయణరెడ్డి (Kandula Narayana Reddy)కి నొక్కండి. మాగుంట అఖండ మెజారిటీతో గెలవాలి. మాగుంటకి వైసీపీలో అన్యాయం జరిగింది… అగౌరవ పరిచి బయటకు వెళ్లేలా చేశారు. అటు వంటి మాగుంటపై తిరుపతి నుండి ఒక రెడ్ శ్యాండిల్ ఉడ్ స్మగ్లర్ ని తీసుకువచ్చారు. అతను మామూలు వ్యక్తి కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి ఎక్కడి నుండి వస్తున్నాయో ముఖ్య మంత్రిగా చేసిన నాకే అర్థం కాలేదు. రెడ్ శ్యాండిల్ అమ్ముకుంటే…రౌడీ ఇజం చేస్తే చెవిరెడ్డికి డబ్బులు వస్తున్నాయి. ఆయన మీదే పుష్ప అని ఒక సినిమా తీశారు..ఇప్పుడు పుష్పా 2 తీస్తున్నారు. ఆ పుష్పా ఇక్కడి వచ్చాడు…ఆ పుష్పాకి ఓటు వేస్తారా.’ అని చంద్రబాబు అన్నారు.
Read Also : Narendra Modi : అవినీతిపరులపై చర్యలు ఆగవు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chevireddy bhaskar Reddy
  • kandalua narayana reddy
  • tdp
  • ys jagan

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd