CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు
- By Sudheer Published Date - 01:49 PM, Tue - 9 January 24

కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు.
విజయవాడ నవోటెల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా అధినేతలు తమ ఫిర్యాదులను , అభిప్రాయాలని సీఈవో తో పంచుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సీఈవో తో సమావేశమై వైసీపీ ఫై పిర్యాదులు చేసారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యహరిస్తుందని, ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే పెద్దయెత్తున ఓట్లు గల్లంతయ్యాయని, దొంగఓట్లు నమోదు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాబు తెలిపారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని, ఆరు నుంచి ఏడు వేల మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. అలాగే ఇక్కడ కూడా జరగాలని కోరారన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత రెండు నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారులను మార్చుతున్నారు. ఎన్నికల సమయానికి వారికి నచ్చిన పోలీసు అధికారులను కోరుకున్న చోట నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సీఈసీకి గట్టిగా తెలియజేశాం అని పవన్ తెలిపారు. ఇక, వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ అని, వారిని ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని ప్రత్యేకంగా విన్నవించాం. ఎన్నికల సంఘం గనుక చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని, హింస పెరిగిపోతుందని చెప్పాం. స్థానిక ఎన్నికల్లో ఒక దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపాం.
మేం చెప్పింది ఎన్నికల సంఘం సావధానంగా విన్నది. ఎన్నికల ప్రధాన అధికారి ఒకటే చెప్పారు… మేం పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం అని భరోసా ఇచ్చినట్లు పవన్ తెలిపాడు.
Read Also : KTR: అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం!