CBN : పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం – చంద్రబాబు
పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం టిఫిన్. మైన్స్ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు
- Author : Sudheer
Date : 27-03-2024 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ నేత పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఫై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేసారు. పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం టిఫిన్. మైన్స్ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు. కాంట్రాక్టులన్నీ పెద్దిరెడ్డే తీసుకుంటున్నారని, ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ (Prajagalam) సభలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై , వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. జగన్ తన బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారని, చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాను రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేక నిందలు భరిస్తున్నట్లు వెల్లడించారు. దుర్మార్గాలు చేసే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఒక్క అవకాశం అని అందరికీ ముద్దులు పెట్టి ఆ తర్వాత ప్రజలను ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. ఆ బాధ ఇప్పుడు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు (Chandrababu) చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ప్రజలను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో కలిగిన ఇబ్బందులను ప్రజలు మరవలేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం అని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఐదేళ్ల నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం ఇది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని గుర్తుచేశారు. సూపర్‌సిక్స్ పథకాలు ప్రకటించానన్న చంద్రబాబు, ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద చదివే ప్రతి పిల్లవాడి తల్లికి రూ.15 వేలు ఇస్తామని వెల్లడించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బాదుడు ఉండదన్న చంద్రబాబు, జాబు రావాలంటే, బాబు రావాలనే నినాధాన్ని ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Read Also : Anasuya : జనసేన కోసం రెడీ అంటున్న అనసూయ..